ప్రాజెక్టులకు అడ్డంకులు

ABN , First Publish Date - 2021-07-18T05:59:45+05:30 IST

తెలుగు రాష్ర్టాల మధ్య నెలకొన్న జల వివాదం కొత్త మలుపు తిరిగింది. కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన అన్ని ప్రాజెక్టులనూ కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ తన పరిధిలోకి తీసుకుంది.

ప్రాజెక్టులకు అడ్డంకులు
తుపాకులగూడెం బ్యారేజీ

గోదావరిపై నిర్మిస్తున్న జలవనరులపై కేంద్రం అభ్యంతరాలు

 ఉమ్మడి వరంగల్‌  జిల్లాలో ఆరు ప్రాజెక్టులకు అనుమతులు లేవని వెల్లడి

 ఆరు నెలల్లో డీపీఆర్‌లు సమర్పించి  పర్మిషన్‌ తీసుకోవాలని ఆదేశాలు

 పనులు పూర్తయినా నీళ్లు వాడొద్దని హెచ్చరిక

 ఇకనుంచి ప్రాజెక్టులన్నీ జీఆర్‌ఎంబీ పరిధిలోకే..


(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)

 తెలుగు రాష్ర్టాల మధ్య నెలకొన్న జల వివాదం కొత్త మలుపు తిరిగింది. కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన అన్ని ప్రాజెక్టులనూ కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ తన పరిధిలోకి తీసుకుంది. ఈ మేరకు రెండు నదులు పరిధులను ఖరారు చేస్తూ గురువారం రాత్రి గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ చేసింది. అక్టోబరు 14 నుంచి ఇది అమల్లోకి రానుంది. గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) పరిధిలోకి తెలంగాణ ప్రాజెక్టులను తీసుకొచ్చింది. తెలంగాణలో కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులతో పాటు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం, కాకతీయ కెనాల్స్‌లోని రెగ్యులేటర్స్‌ను కూడా జీఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకొచ్చింది. దీందో గోదావరిపై నిర్మించే బ్యారేజీలు, డ్యామ్‌లు, రిజర్వాయర్లు, కాల్వల నెట్‌వర్కులు, నీటి సరఫరా, నియంత్రణ వ్యవస్థలు మొత్తం బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. తెలంగాణలో గోదావరిపై నిర్మిస్తున్న 16 ప్రాజెక్టులకు అనుమతులు లేవని కేంద్రం పేర్కొంది. అందులో ఆరు ప్రాజెక్టులు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందినవే ఉన్నాయి. 

ప్రభావం పడేది వీటిపైనే..

కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాలతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆరు కీలకమైన ప్రాజెక్టులపై ప్రభావం ప డనుంది. ముఖ్యంగా రైతుల కు సాగునీరు, వరంగల్‌ నగర వాసులకు తాగు నీటిని అందిస్తున్న దేవాదుల ప్రాజెక్టుపై ప్రభావం పడనుంది. 2013లో చేపట్టిన దేవాదుల ప్రాజెక్టుకు సరిపడా నీళ్లు గోదావరిలో లభించటం లేదని, 2017 ఫిబ్రవరిలో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద రూ.1,624 కోట్ల వ్యయంతో గోదావరిపై బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. దాదాపు బ్యారేజీ నిర్మా ణం పూర్తయింది. దేవాదుల లిఫ్ట్‌ వరకు 6.94 టీఎంసీ ల నీరు నిల్వ ఉండనుంది. దీంతో దేవాదుల ఎత్తిపోతలకు అవసరమైన నీళ్లు లభించనుంది. అయితే ఈ బ్యా రేజీకి అనుమతి లేదని కేంద్రం అంటోంది. దీంతో పాటు రామప్ప నుంచి పాకాల, లక్నవరం సరస్సులకు గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు రూ.30వేల కోట్లు కేటాయించారు. ఇప్పటికే రామప్ప నుంచి పాకాల వరకు, రామప్ప నుంచి గణపసముద్రం వరకు పనులు పూర్తయి ట్రయిల్‌ రన్‌ కూడా నిర్వహించారు. రామప్ప నుంచి లక్నవరానికి నీటిని తరలించే పనులు మాత్ర మే పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఈ ఎత్తిపోతలకు కూడా అనుమతులు లేవని, వీటిని నిలిపివేయాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ఇదిలా ఉండగా రూ.80.40 వేల కోట్ల వ్యయంతో గోదావరి నుంచి 90 రోజుల పాటు 180 టీఎంసీల నీటిని తరలించేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది.  దీంతో పాటు అదనంగా మరో టీఎంసీ అంటే.. గోదావరి నుంచి మూడు టీఎంసీలు నీటిని తరలించేందుకు మరో రూ.43వేల కోట్లను ఖర్చు చేస్తూ  ప్రభుత్వం పనులు చేపట్టింది. ఇప్పటికే భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద మూడో టీఎంసీ నీటిని ఎత్తిపోసేందుకు రూ.500 కోట్ల వ్యయంతో అదనంగా ఆరు మోటార్లను బిగించారు. ఈ మూడో టీఎంసీకి కూడా కేంద్రం అనుమతి లేకపోవటంతో ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం వద్ద గోదావరిపై 2008 సెప్టెంబరులో అప్పటి సీఎం వె.ౖఎ్‌స.రాజశేఖరరెడ్డి ముక్తీశ్వర (చిన్న కాళేశ్వరం) ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రూ.532 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు 70శాతం వరకు పూర్తయ్యాయి. అయితే ఈ ప్రాజెక్టుకు కూడా అనుమతి లేకపోవటంతో నిలిపివేయాలని కేంద్రం పేర్కొంది. ములుగు జిల్లా వాజేడు మండలం కిష్టాపురం సమీపంలో గోదావరి నది సమీపంలోని మోదీకుంట వాగుపై ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 2005లో మోదీకుంట ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టా రు. 2018లో పర్యావరణ అనుమతులు లభించాయి. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 15వేల ఎకరాలకు సాగునీరు, 35 గ్రామాలకు తాగునీరు అందించే అవకాశం ఉంది. సుమారు రూ.450 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా తీయలేదు.  ఈ ప్రాజెక్టుకు కూడా అనుమతులు లేవని కేంద్రం పేర్కొంది. అలాగే దేవాదుల ఎత్తిపోతలకు గోదావరిలో నీటి సామర్థ్యాన్ని పెంచేందుకు 2009లో ఏటూరునాగారం మండలం కంతనపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలని అప్ప టి ప్రభుత్వం భావించింది. రూ.10,409 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు నిర్వహించారు. ఈ బ్యారేజీతో ముప్పు ప్రాంతాల సంఖ్య పెరుగుతుండటంతో కంతనపల్లి ప్రాజెక్టును తుపాకులగూడెం వద్దకు మార్చి రీడిజైన్‌ చేశారు. అయితే ఈ బ్యారేజీ పనులు చేపట్టినప్పటికీ కేంద్ర జలవనరుల శాఖ మాత్రం కంతనపల్లి బ్యారేజీ అనుమతులు లేని ప్రాజెక్టుగా పేర్కొంది.

ఈ ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటీ..?

గోదావరిపై నిర్మిస్త్తున్న ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవాలని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ గత ఏడాది అక్టోబరు 6న ఢిల్లీలో నిర్వహించిన ఆపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కోరింది. జూన్‌ 10 వరకు గడు వు కూడా ఇచ్చింది. కాళేశ్వరం మూడో టీఎంసీ, తుపాకులగూడెం బ్యారేజీ, రామప్ప-పాకాల లెక్‌ రెగ్యులేటర్‌ వర్కులపై అప్పట్లో అభ్యంతరాలు చెప్పింది. అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం జీఆర్‌ఎంబీకి డీపీఆర్‌ ను అందించలేదు. అనుమతులు లేకుండానే పనులు చేస్తుండటంతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆగ్ర హం వ్యక్తం చేసింది. అనుమతులు తీసుకోకుండా ని ర్మాణం చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌ను ఆరు నెలల్లో అందించాలని ఆదేశించారు. ఒకవేళా ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఆ ప్రాజెక్టు నుంచి నీటిని వాడుకోవద్దని హెచ్చరించింది. దీంతో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన తుపాకులగూడెం బ్యారే జీ, రామప్ప-పాకాల, గణపసముద్రం ఎత్తిపోతలు, కాళేశ్వరం అదనపు టీఎంసీ, దాదాపు 70శాతం పూర్తయిన ముక్తీశ్వర ఎత్తిపోతలపై సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో గోదావరి నది యాజమాన్య బోర్డుకు ప్రభుత్వం డీపీఆర్‌ అందిస్తుందా.. ఆరు నెలల్లో ప్రభుత్వం కేంద్రం పేర్కొన్న ప్రాజెక్టుల అనుమతులకు దరఖాస్తు చేసుకుంటుందా..? అనేది ఉత్కంఠగా మా రింది. ఒకవేళా అనుమతులు రాకుంటే ఇప్పటికే వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది.

అక్రమ నిర్మాణాలని కేంద్ర జలవనరుల శాఖ పేర్కొన్న  ప్రాజెక్టులు ఇవే..

- కాళేశ్వరం అదనపు మూడో టీఎంసీ ప్రాజెక్టు

- రామప్ప-పాకాల లేక్‌ రెగ్యులేటర్‌ వర్క్‌

- తుపాకులగూడెం బ్యారేజీ

- ముక్తీశ్వర (చిన్న కాళేశ్వరం) ప్రాజెక్టు

- మోదీకుంట వాగు ప్రాజెక్టు

- కంతనపల్లి ప్రాజెక్టు 

Updated Date - 2021-07-18T05:59:45+05:30 IST