కరోనా యాక్టివ్‌ కేసుల్లో తెలంగాణకు 5వ స్థానం

ABN , First Publish Date - 2020-07-07T07:38:30+05:30 IST

కరోనా యాక్టివ్‌ కేసుల్లో తెలంగాణకు 5వ స్థానం

కరోనా యాక్టివ్‌ కేసుల్లో తెలంగాణకు 5వ స్థానం

న్యూఢిల్లీ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): కరోనా యాక్టివ్‌ కేసుల విషయంలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో 5వ స్థానంలో నిలిచింది. రికవరీ రేటు 53.15 శాతంగా ఉంది. ఈ మేరకు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖలోని నేషనల్‌ అట్లాస్‌ అండ్‌ థిమాటిక్‌ మ్యాపింగ్‌ ఆర్గనైజేషన్‌ రూపొందించిన ప్రత్యేక డ్యాష్‌బోర్డు వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా గణాంకాలను ఈ డ్యాష్‌బోర్డులో నమోదు చేస్తారు. దీని ప్రకారం 10904 యాక్టివ్‌ కేసులతో తెలంగాణ దేశంలో 5వ స్థానంలో ఉంది. 

Updated Date - 2020-07-07T07:38:30+05:30 IST