తెలంగాణ రిచ్ స్టేట్.. ఏపీ పూర్ స్టేట్‌గా తయారైంది: ఉండవల్లి

ABN , First Publish Date - 2022-04-16T00:43:02+05:30 IST

సీఎం జగన్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బిజినెస్ మాన్ అని పెద్ద గేబ్లింగ్ ఆడుతున్నారని దుయ్యబట్టారు.

తెలంగాణ రిచ్ స్టేట్.. ఏపీ పూర్ స్టేట్‌గా తయారైంది: ఉండవల్లి

అమరావతి: సీఎం జగన్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బిజినెస్ మాన్ అని పెద్ద గేబ్లింగ్ ఆడుతున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కిడ్‌ప్రోకో అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓ పక్క డబ్బులు ఇస్తూ.. మరో వైపు పన్నుల రూపంలో లాగేస్తున్నారని విమర్శించారు. విద్యుత్‌పై జగన్‌కి ముందు చూపు లేదని తప్పుబట్టారు. ఇంతకు ముందు రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండేదని తెలిపారు. తెలంగాణలో పవర్ కట్ లేదని, ఏపీలో కరెంట్ కట్ విపరీతంగా ఉందన్నారు. విద్యుత్ కష్టాల నుంచి బయటపడ్డానికి ఎన్ని యుగాలు పడుతుందోనని ఉండవల్లి పేర్కొన్నారు.


జగన్ ఎంతకాలం బటన్స్ నొక్కి డబ్బులు ఇవ్వగలడో ఇప్పుడే చెప్పలేమన్నారు. జగన్ చేస్తుంది తప్పని చెప్పేవాళ్లు లేరని, ఆయన ఎవరిమాట వినరని విమర్శించారు. ఏపీలో ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ లేదని తప్పుబట్టారు. ఎన్నికల ముందు మాజీ సీఎం చంద్రబాబు రూ.10 వేలు పంచినా ఓట్లు రాలేదన్నారు. డబ్బులు పంచుతున్నాను కదా? తనకే ఓటు వేస్తారని జగన్ అనుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ రిచ్ స్టేట్.. ఏపీ పూర్ స్టేట్‌గా తయారైందన్నారు. ప్రధాని మోదీకి జగన్ ఇచ్చిన వినతిపత్రంలో ప్రత్యేక హోదా అంశం లేదని ఉండవల్లి అరుణ్‌కుమార్ వెల్లడించారు.

Updated Date - 2022-04-16T00:43:02+05:30 IST