TS News: తెలంగాణ ఆర్టీసీలో స్వాతంత్ర్య వజ్రోత్సవాలు
ABN , First Publish Date - 2022-08-15T13:12:44+05:30 IST
ఆజాదీ కా అమృత మహోత్సవ్ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీలో అధికారులు స్వాతంత్ర్య వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ (Hyderabad): ఆజాదీ కా అమృత మహోత్సవ్ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీలో అధికారులు స్వాతంత్ర్య వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 75 ఏళ్లు పైబడిన వారికి సోమవారం (ఈరోజు) తెలంగాణ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే సోమవారం (15వ తేదీన) పుట్టబోయే శిశువులకు టీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. చిన్నారులందరికీ 12 ఏళ్ల వయసు వచ్చే వరకు సిటీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు ప్రకటించింది.