shataka sahityam శతక సాహిత్యానికి తెలంగాణ పుట్టినిల్లు

ABN , First Publish Date - 2022-05-22T20:44:40+05:30 IST

శతక సాహిత్యానికి తెలంగాణ పుట్టినిల్లు అని తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్(juluru gowri shankar)అన్నారు

shataka sahityam శతక సాహిత్యానికి తెలంగాణ పుట్టినిల్లు

హైదరాబాద్: శతక సాహిత్యానికి తెలంగాణ పుట్టినిల్లు అని తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్(juluru gowri shankar)అన్నారు. సాహిత్యఅకాడమీ కార్యాలయంలో మంథెన రంగనాయకమ్మ రాసిన ‘ కవితా ఝరి’ శతకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయనమాట్లాడుతూ రంగనాయకమ్మ ‘కవితా ఝరి’ వారసత్వంలో తెలంగాణ స్కూలు పిల్లలు కూడా అద్భుతంగా సరళ భాషల్లోశతకాలు రాయటం తెలుగు సాహిత్యంలో పెనుమార్పుఅని కొనియాడారు. తొలి తెలుగు కవయిత్రి మొల్ల, రామాయణం రాస్తే కవయిత్రి రంగనాయకమ్మ రాముని చరిత్రను శతక రూపంలో రాశారని తెలిపారు. 


రంగనాయకమ్మ కథాత్మకమైన శతకాన్ని రచించి కొత్త ఒరవడి చుట్టారని పేర్కొన్నారు. శేషప్పశతకం, తిరునగరి శతకం, యాదగిరి శతకాలు రాసిన వొరవడిలో రంగనాయకమ్మ శతకం వచ్చిందని విశ్లేషించారు. మంథెన రంగనాయకమ్మ సాంప్పదాయ చదువులు చదువుకోలేదని, ఓరుగల్లు సాహితీ వాతావరణమే ఆమెను పద్యకవయిత్రిని చేసిందన్నారు. రామాయణాది పురాణాలు, కావ్యాలు చదువుకున్నఅద్బుత పరిణతితో పద్య కవిత్వం రాశారన్నారు. మరుగునపడిన ఈ కవయిత్రి రచనలు రఘునందన శతకం, రుక్మిణీ కళ్యాణం, భగవన్నామ భజనకీర్తనలు, ఆమె కుమారుడు డా. మంథెన దామోదరాచారి, ఆంగ్ల కవి, రచయిత ప్రసిద్ధ అనువాదకులు ఈ రచనలను వెలుగులోకి తీసుకు రావడం అభినందనీయమని అన్నారు. 


రామాయణాన్ని, రుక్మిణీ కళ్యాణాన్ని,కీర్తనలను ఆకాలంలోనే సరళమైన భాషలో , ఆపాత మధురంగా రచించడం అభినందనీయమన్నారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరవాతే ఎందరెందరో మహా కవులు, రచయిత్ర్రులు రాసిన కావ్యాలు వెలుగులోకి వస్తున్నాయని గౌరీశంకర్ పేర్కొన్నారు. అరుదైన రచనలను ప్రచురించడానికి సాహిత్యం అకాడమీ చేదోడు వాదోడుగా ఉంటుందన్నారు. ఈ పుస్తకావిష్కరణ సభలో మంథెన ప్రమద, డా. మంథెన దామోదరాచారి, ఉదయ భాస్కర్, కాళోజీ పురస్కార గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-22T20:44:40+05:30 IST