Telanganaలో పోలీసు ఉద్యోగాల వయోపరిమితి పెంపు

ABN , First Publish Date - 2022-05-20T22:14:31+05:30 IST

తెలంగాణ (Telangana)లో పోలీసు ఉద్యోగాల వయోపరిమితిని మరో రెండేళ్లు తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది.

Telanganaలో పోలీసు ఉద్యోగాల వయోపరిమితి పెంపు

హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో పోలీసు ఉద్యోగాల వయోపరిమితిని మరో రెండేళ్లు తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. ఎస్సై ఉద్యోగాలకు 30 ఏళ్లు, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు 27 ఏళ్లు కటాఫ్‌ పెట్టారు. కరోనా కారణంగా రెండేళ్లు విలువైన కాలాన్ని యువత కోల్పోయింది. అందువల్ల వయోపరిమితిని పెంచాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పోలీసు శాఖలో నియామకాలకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేష్‌కుమార్ (CS Someshkumar), డీజీపీని సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 80వేలకు పైగా ప్రభుత్వ  ఉద్యోగాలను వివిధ శాఖల్లో భర్తీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటిసారిగా పోలీసుశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌శాఖలో ఖాళీగా ఉన్న ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ (SI Constable) పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. శుక్ర‌వా‌రంతో దర‌ఖా‌స్తు‌లకు గడువు ముగు‌స్తుంది.

Updated Date - 2022-05-20T22:14:31+05:30 IST