అమెరికాలో వైభవంగా ప్రారంభమైన తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-05-29T03:04:49+05:30 IST

తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఉత్సవాలు న్యూజెర్సీ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి.

అమెరికాలో వైభవంగా ప్రారంభమైన తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఉత్సవాలు

తరలివచ్చిన తెలంగాణా నేతలు

న్యూజెర్సీ నుండి 'ఆంధ్రజ్యోతి' ప్రతినిధి కిలారు ముద్దుకృష్ణ

తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఉత్సవాలు న్యూజెర్సీ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ప్రతిబింబించే విధంగా పరిసరాలను తీర్చిదిద్దారు. బ్యాంక్వెట్ విందుతో ఉత్సవాలు మొదలయ్యాయి. వివిధ రంగాల్లో ప్రముఖులకు అవార్డులు అందజేశారు. తెలంగాణాకు చెందిన ఎంపీలు డి.అరవింద్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి,  డీకే అరుణ, మధుయాష్కి,  మంత్రి జగదీశ్వర్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. టీటీఏ  వ్యవస్థాపక అధ్యక్షుడు పైళ్ల మల్లారెడ్డి, అధ్యక్షుడు పటోళ్ల మోహన్ రెడ్డి, కాన్ఫరెన్స్ కమిటీ కన్వీనర్ గనగొని శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. యాంకర్ సుమ సంధానకర్తగా వ్యవహరించారు. కోటి సంగీత విభావరి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో మంచి విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు.









Updated Date - 2022-05-29T03:04:49+05:30 IST