TET Results: తెలంగాణ TET ఫలితాలు వచ్చేశాయ్

ABN , First Publish Date - 2022-07-01T19:33:30+05:30 IST

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను అధికారులు విడుదల చేశారు.

TET Results: తెలంగాణ TET ఫలితాలు వచ్చేశాయ్

హైదరాబాద్: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను అధికారులు విడుదల చేశారు. టెట్ పేపర్-1లో 1,04,078 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. 32.68% ఉత్తీర్ణత నమోదైంది. అలాగే పేపర్-2లో 1,24,535 మంది అర్హత సాధించడంతో ఉత్తీర్ణత 49.64 % గా నమోదైంది. కాగా, ఇప్పటికే టెట్ ఫైనల్ కీని టెట్ కన్వీనర్ రాధారెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక జూన్ 12న నిర్వహించిన టెట్ పరీక్ష పేపర్-1కు 3,18 ,506 మంది, పేపర్-2కు 2,51,070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తాజాగా విడుదలైన ఫలితాల కోసం https://tstet.cgg.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. 

Updated Date - 2022-07-01T19:33:30+05:30 IST