నేడు విద్యా పరిరక్షణ కమిటీ ధర్నా

ABN , First Publish Date - 2021-01-09T06:17:51+05:30 IST

భారత రైతాంగ ప్రతిఘటనా పోరాటానికి సంఘీభావంగా తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా జరుగనున్నది. 2014లో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చాక ఒకే...

నేడు విద్యా పరిరక్షణ కమిటీ ధర్నా

భారత రైతాంగ ప్రతిఘటనా పోరాటానికి సంఘీభావంగా తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా జరుగనున్నది. 2014లో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చాక ఒకే దేశం-ఒకే మార్కెట్‌ అనే సంకుచిత నినాదంతో కార్పొరేటీకరణను ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ సంస్థలను, సహజ వనరులను, సేవారంగాలను పూర్తిగా ప్రైవేటీకరించే సాహసం చేసింది.


జాతీయ విద్యావిధానం-2020 ఏ ప్రజాస్వామిక చర్చ లేకుండా, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం లేకుండా కేవలం కేంద్ర కేబినెట్‌ నిర్ణయంతో అమలుకు ప్రభుత్వం ఆజ్ఞలు జారీ చేస్తోంది. నూతన వ్యవసాయ బిల్లుల పరిస్థితి కూడా ఇదే. మూడు దశాబ్దాలుగా కార్పొరేట్‌ విధానాల వల్ల అనేక ఇక్కట్లను ఎదుర్కొన్న రైతులు వ్యవసాయ బిల్లుల రద్దుకు ఉద్యమం చేస్తున్నారు. ఈ ప్రతిఘటన నుండి విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు స్ఫూర్తి పొంది జాతీయ విద్యావిధాన మూలాలను ప్రశ్నించాల్సి ఉంది. నాలుగున్నర దశాబ్దాలుగా విద్యా పరిరక్షణకు ఉద్యమిస్తున్న విద్యా పరిరక్షణ కమిటీ రైతాంగ ప్రతిఘటనకి సంఘీభావం తెలుపుతూ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నది. రైతులు కూడా విద్యాపరిరక్షణ పోరాటానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నది.


– తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ


Updated Date - 2021-01-09T06:17:51+05:30 IST