రిజర్వాయర్లలో ఉన్న నీరంతా మాదే..!

ABN , First Publish Date - 2021-04-23T09:40:57+05:30 IST

ఈ ఏడాది తమకు కేటాయించిన నీటిలో ఇంకా 102 టీఎంసీలను ఉపయోగించుకోలేదని, ప్రస్తుతం రిజర్వాయర్లలో నిల్వ ఉన్న నీరంతా తమదేనని తెలంగాణ

రిజర్వాయర్లలో ఉన్న నీరంతా మాదే..!

కృష్ణా బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది తమకు కేటాయించిన నీటిలో ఇంకా 102 టీఎంసీలను ఉపయోగించుకోలేదని, ప్రస్తుతం రిజర్వాయర్లలో నిల్వ ఉన్న నీరంతా తమదేనని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్‌ శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌రావు కృష్ణా బోర్డు కు లేఖ రాశారు. ఈ ఏడాది కృష్ణా బేసిన్‌లో మొత్తం 902 టీఎంసీల నీటి ల భ్యత ఉందని, ఇందులో తెలంగాణకు 306 టీఎంసీలు, ఏపీకి 595 టీఎంసీల ను కేటాయించారని గుర్తు చేశారు. అయితే కేటాయించిన నీటి కంటే ఏపీ అ దనంగా 21 టీఎంసీలను ఉపయోగించుకుందని తెలిపారు. తెలంగాణ మా త్రం తనకు కేటాయించిన నీటి కంటే సుమారు 102 టీఎంసీలను తక్కువగా ఉపయోగించుకుందని లేఖలో పేర్కొన్నారు.


ప్రస్తుతం ఉమ్మడి రిజర్వాయర్ల లో 80 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఈ నీరంతా తెలంగాణకే చెందుతుంద ని ఈఎన్‌సీ ప్రస్తావించారు. కాగా, తమ తాగునీటి అవసరాల కోసం 7 టీఎంసీల నీటిని కేటాయించాలని ఏపీ ప్రభుత్వం ఈ నెల 9న బోర్డును కోరిన వి షయం తెలిసిందే. అయితే ఏపీ అభ్యర్థనపై అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా కృష్ణా బోర్డు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. దానికి స్పందనగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ లేఖను రాసింది.

Updated Date - 2021-04-23T09:40:57+05:30 IST