తెలంగాణ తరహా మాదకద్రవ్యాల వినియోగం, పబ్‌కల్చర్ ఏపీలో లేదు: మంత్రి వనిత

ABN , First Publish Date - 2022-04-30T01:55:12+05:30 IST

తెలంగాణ తరహా మాదకద్రవ్యాల వినియోగం, పబ్‌కల్చర్ ఏపీలో లేదు: మంత్రి వనిత

తెలంగాణ తరహా మాదకద్రవ్యాల వినియోగం, పబ్‌కల్చర్ ఏపీలో లేదు: మంత్రి వనిత

అమరావతి: తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి తానేటి వనిత స్పందించారు. తెలంగాణతో పోలిస్తే అభివృద్ధి అంశాల్లో నెమ్మదిగా వెళ్తున్నామని వనిత అన్నారు. తెలంగాణ తరహా మాదకద్రవ్యాల వినియోగం, పబ్‌కల్చర్ ఏపీలో లేదని మంత్రి తానేటి వనిత గుర్తు చేశారు. ఏపీలో ఎన్ని క్లిష్టపరిస్థితులు ఉన్నా పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రమ్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. శిక్షలు త్వరగా అమలైతే నేరస్తుల్లో భయం పుడుతుందని తానేటి వనిత స్పష్టం చేశారు.


అంతకు ముందు ఏపీ పరిస్థితులపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కరెంట్‌, నీటి సౌకర్యం లేదని, రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని శుక్రవారం హైదరాబాద్‌ మాదాపూర్‌ హైటెక్స్‌ సిటీలో జరిగిన క్రెడాయ్‌ ప్రాపర్టీ షోలో మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ విషయం ఏపీకి వెళ్లొచ్చిన తన స్నేహితులు చెబుతున్నారన్నారని, ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్లు ఉందని చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. అనుమానం ఉంటే.. ఎవరైనా ఏపీకి వెళ్లిరండని మంత్రి కేటీఆర్ సలహా ఇచ్చారు. ఏపీతో పోలిస్తే..తెలంగాణలో రోడ్లు, మౌలిక సదుపాయాలు బాగున్నాయని కేటీఆర్ చెప్పారు.

Updated Date - 2022-04-30T01:55:12+05:30 IST