27న యువ శాస్త్రవేత్తలతో టెలీకాన్ఫరెన్స్‌ : డీఈవో

ABN , First Publish Date - 2022-06-25T05:25:22+05:30 IST

జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో సృజనాత్మక, శాస్త్రీయ అభిరుచులను పెంపొందించాలని ప్రధాన లక్ష్యంతో ఈ నెల 27న యువశాస్త్రవేత్తలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నట్లు డీఈవో దుర్గాప్రసాద్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

27న యువ శాస్త్రవేత్తలతో టెలీకాన్ఫరెన్స్‌ : డీఈవో

నిజామాబాద్‌అర్బన్‌, జూన్‌ 24: జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో సృజనాత్మక, శాస్త్రీయ అభిరుచులను పెంపొందించాలని ప్రధాన లక్ష్యంతో ఈ నెల 27న యువశాస్త్రవేత్తలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నట్లు డీఈవో దుర్గాప్రసాద్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ సంచాలకుల ఆదేశాల మేరకు వివిధ యాజమాన్యాల కింద ఉన్న పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు టీషాట్‌ నెట్‌వర్క్‌ద్వారా మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు యువశాస్త్రవేత్తలతో నిర్వహించే ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రిన్సిపాళ్లు ఈ కార్యక్రమ వీక్షణకు ఏర్పాట్లు చేయాలని ఇతర వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి గంగాకిషన్‌ను సంప్రదించాలన్నారు. 

ప్రైవేట్‌ పాఠశాలల తనిఖీ 

నగరంలోని రవి పబ్లిక్‌ స్కూల్‌, ప్రెసిడెన్సీ పాఠశాలను డీఈవో దుర్గాప్రసాద్‌ శుక్రవారం తనిఖీ చేశారు. పాఠశాలలో ఫీజుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫీజుల వివరాలతో కూడిన బోర్డును ఏర్పాటు చేయాలని పాఠశాల నిర్వాహకులను ఆదేశించారు. 


Updated Date - 2022-06-25T05:25:22+05:30 IST