టాంటెక్స్ ఆధ్వర్యంలో ఫాదర్స్ డే సంబరాలు

ABN , First Publish Date - 2021-06-24T06:41:34+05:30 IST

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఫాదర్స్ డే సందర్భంగా ‘టాంటెక్స్‌తో మీ అనుబంధం మరియు జీవిత అనుభవాలు’ అంశం మీద సంస్థ ప్రారంభించిన తొలినాళ్ల నుంచి పని చేసిన అధ్యక్షులం

టాంటెక్స్ ఆధ్వర్యంలో ఫాదర్స్ డే సంబరాలు

టెక్సాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఫాదర్స్ డే సందర్భంగా ‘టాంటెక్స్‌తో మీ అనుబంధం మరియు జీవిత అనుభవాలు’ అంశం మీద సంస్థ ప్రారంభించిన తొలినాళ్ల నుంచి పని చేసిన అధ్యక్షులందరితో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసింది. కొవిడ్ కారణంగా ఈ కార్యక్రమం అంతర్జాలం వేదికగా జరిగింది. ముందుగా టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు లక్షి అన్నపూర్ణ పాలేటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ పూర్వ అధ్యక్షులకు స్వాగతం పలికారు. ఫాదర్స్ సందర్భంగా వారి నాన్న గారితో తన అనుభవాలను సభికులతో పంచుకున్నారు. అనంతరం కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా శ్రీనివాసులు బసాబత్తిన‌ని ఆహ్వానించారు. 



ఈ సందర్భంగా శ్రీనివాసులు.. కార్యక్రమానికి విచ్చేసిన పూర్వాధ్యక్షులు ఆనందమూర్తి కూచిబొట్ల, జానార్ధన్ రావు, రాం ఎలమంచి, సుభాష్ చలసాని, మూర్తి ములుకుంట్ల, రాజా రెడ్డి, డా శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, చంద్రశేఖర్ కన్నెగంటి, సురేష్ మండువ, డా. నరసింహారెడ్డి ఉరిమిండి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ తదితరులకు సాదర స్వాగతం పలికారు. అంతేకాకుండా పూర్వాధ్యక్షుల సంస్థకు చేసిన కృషిని గుర్తు చేశారు. సంస్థను స్థాపించిన రామకృష్ణ నూనెకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ తన అనుభవాలను సభలో పంచుకున్నారు. పూర్వాధ్యక్షులు అందరూ ఒక్కొక్కరుగా తమ అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా తమ తండ్రితో తమకున్న అనుభవాలను పంచుకున్నారు. చక్కటి జీవితాన్ని అందించిన తల్లిదండ్రులకు ఎంతో రుణపడి ఉన్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ప్రస్తుత అధ్యక్షురాలు లక్ష్మి అన్నపూర్ణ పాలేటిని అభినందించారు. సుమారు రెండు గంటపాటు సాగిన కార్యక్రమాన్ని ముగింపు పలకాల్సిందిగా పాలక మండలి ఉపాధిపతి వెంకట్ ములుకుట్ల.. సరితా రెడ్డి ఈదరను ఆహ్వానించారు. ఆమె కార్యక్రామనికి హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించారు. 


Updated Date - 2021-06-24T06:41:34+05:30 IST