మహానాడుకు తరలిన తెలుగు తమ్ముళ్లు

ABN , First Publish Date - 2022-05-28T06:02:29+05:30 IST

ఒంగోలు మండలం మండవవారిపాలెం వద్ద టీడీపీ నిర్వహించిన మహా నాడులో భాగంగా ప్రతినిధుల సభకు శుక్రవారం తెలుగుతమ్ముళ్లు తరలివెళ్లారు.

మహానాడుకు  తరలిన తెలుగు తమ్ముళ్లు
మహానాడుకు తరలివెళుతున్న నాయకులు

మార్కాపురం, మే 27: ఒంగోలు మండలం మండవవారిపాలెం వద్ద టీడీపీ నిర్వహించిన మహా నాడులో భాగంగా ప్రతినిధుల సభకు శుక్రవారం తెలుగుతమ్ముళ్లు తరలివెళ్లారు. మార్కాపురం నుంచి  జడ్పీటీసీ మాజీ సభ్యుడు కందుల రామిరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జున్‌, పట్టణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు షేక్‌ మౌలాలీ, కొప్పుల శ్రీనివాసులు, మండల కమిటీ అధ్యక్షులు జవ్వాజి రామాంజనేయరెడ్డి, కౌన్సిలర్లు యేరువ వెంకట నారాయణరెడ్డి, నాలి కొండయ్య యాదవ్‌, తెలుగుయువత నాయకులు దొడ్డా రవికుమార్‌, తదితరులు తరలివెళ్లారు.

పెద్దారవీడు నుంచి...

ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెద్దారవీడు మండలం నుంచి టీడీపీ మండల అధ్యక్షుడు మెట్టు శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో మాజీ అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసరెడ్డి, మాజీ జడ్పీటీసీలు గుమ్మా గంగరాజు, జడ్డా రవి, మాజీ సర్పంచ్‌ చిలకా ఇజ్రాయేల్‌ తదితరులు మహానాడుకు తరలివెళ్లారు. 

270 వాహనాలలో మహానాడుకు..

గిద్దలూరు : ఒంగోలులో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి హాజరయ్యేందుకు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ ముత్తుముల అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో 270 వాహనాలలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారపేట, కంభం, అర్థవీడు మండలాల నుంచి 270 వాహనాలతో బేస్తవారపేట జంక్షన్‌కు చేరే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాలలో గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒంగోలు వెళ్లి మహానాడు బహిరంగ సభలో పాల్గొనేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. 

ఎర్రగొండపాలెం : రాష్ట్రం మళ్లీ అభివృద్ది చెందాలంటే నారాచంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని టీడీపీ ఎస్సీ సెల్‌  రాష్ట్ర  కార్యదర్శి ఎంసీహెచ్‌ మంత్రునాయక్‌ అన్నారు. ఎర్రగొండపాలెం మండలం మొగుళ్లపల్లి గ్రామంలో గురువారం ప్రసనాంజనేయస్వామి తిరునాళ్ల సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్‌ ప్రభపై నుంచి టీడీపీ నాయకులు మాట్లాడారు. ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి  మంత్రునాయక్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో డీజిల్‌, పెట్రోలు, నిత్యావసర ధరలు, విద్యుత్తు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని అన్నారు.  2024లో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబును గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు చేకూరి సుబ్బారావు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ చేకూరి ఆంజనేయులు, నాయకులు కామేపల్లి వెంకటేశ్వర్లు, షేక్‌ జిలానీ, వడ్లమూడి లింగయ్య,  కె సత్యనారాయణగౌడ్‌, వేగినాటి శ్రీను, కొత్త భాస్కర్‌, కొమరోలు సర్పంచి కొల్లిపాటి శ్రీనివాసరావు, మాజీ సర్పంచి చెవుల అంజయ్య, తెలుగుయువత నాయకులు మల్లిపెద్ది శివరామకృష్ణ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

రక్తదాన శిబిరంలో పాల్గొన్న మన్నే

ఎర్రగొండపాలెం : ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో మహానాడు ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన  రక్తదాన శిబిరంలో జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టరు మన్నె రవీంద్ర సేవలందించారు. ఎర్రగొండపాలెం టీడీపీ కార్యకర్త మల్లికార్జున రక్తదానం చేసి ఎన్టీఆర్‌ పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. రక్తదానం చేసిన మల్లికార్జునను జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు డాక్టరు మన్నె రవీంద్ర అభినందించి  ప్రశంసాపత్రం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ  టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు, ఎర్రగొండపాలెం మండల టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-28T06:02:29+05:30 IST