తెలుగు సినీ రంగం ప్రపంచంలో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంటుంది: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-05-01T19:47:22+05:30 IST

తెలుగు సినీ రంగం ప్రపంచంలో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంటుంది: కిషన్‌రెడ్డి

తెలుగు సినీ రంగం ప్రపంచంలో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంటుంది: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: తెలుగు సినీ రంగం ప్రపంచంలో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలుగు సినిమా అంతర్జాతీయ గుర్తింపు వెనుక దర్శక నిర్మాతలు, నటీనటులతోపాటు కార్మికుల కృషి ఉందన్నారు. ప్రధాని మోదీ కూడా తెలుగు సినిమా ప్రాధాన్యతను ప్రశంసించారని చెప్పారు. మన నటీనటులను పొరుగు రాష్ట్రాల వాళ్లు అనుసరిస్తున్నారని, సినీ రంగంలోని 24 విభాగాలు కరోనా వల్ల చాలా ఇబ్బంది పడ్డాయని తెలిపారు. కరోనా వల్ల పర్యాటక, సినీ రంగాలు చాలా నష్టపోయాయని కిషన్ రెడ్డి అన్నారు. వ్యాక్సిన్ రావడం వల్ల మళ్లీ పర్యాటక, సినీ రంగాలు నిలదొక్కుకున్నాయని, కార్మికుల సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2022-05-01T19:47:22+05:30 IST