ఐటీఎఫ్ చాంప్ ప్రాంజల
ABN , First Publish Date - 2021-12-06T07:33:29+05:30 IST
ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ సింగిల్స్ టైటిల్ను తెలుగు తేజం యడ్లపల్లి ప్రాంజల సొంతం చేసుకుంది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ సింగిల్స్ టైటిల్ను తెలుగు తేజం యడ్లపల్లి ప్రాంజల సొంతం చేసుకుంది. ఆదివారం బెంగళూరులో జరిగిన ఈ ఫైనల్లో ప్రాంజల 7-5, 6-2తో భవిశెట్టి సౌజన్యపై నెగ్గింది.