తెలంగాణ తెలుగమ్మాయికి.. కోలీవుడ్‌లో వరుస అవకాశాలు

Published: Sat, 22 Jan 2022 22:21:45 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తెలంగాణ తెలుగమ్మాయికి.. కోలీవుడ్‌లో వరుస అవకాశాలు

తెలంగాణలోని వరంగల్‌కు చెందిన తెలుగమ్మాయి ఆనంది తమిళంలో ‘కయల్‌’ ఆనందిగా గుర్తింపు పొందింది. ఈమె గత యేడాది ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఈమెకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. ‘కయల్‌’ అనే చిత్రం ద్వారా ఆనంది తమిళ వెండితెరకు పరిచయమైంది. దీంతో ఆమె పేరు ‘కయల్‌’ ఆనందిగా స్థిరపడిపోయింది. తమిళం, తెలుగు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. 


అయితే, వివాహం తర్వాత కోలీవుడ్‌లో అవకాశాలు తగ్గుతాయని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ, ‘కయల్‌’ ఆనందికి మాత్రం వరుస అవకాశాలు వస్తున్నాయి. తమిళ ప్రముఖ హీరో ఆర్‌.కె.సురేష్‌ తన సొంత నిర్మాణ సంస్థ స్టూడియో 9 బ్యానరుపై ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చురి గదిలో జరిగిన ఒక యథార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ చిత్రం స్ర్కీన్‌ప్లే సమకూర్చారు. ఈ చిత్రంలో ఆనంది నటిస్తోంది. కాగా, గత యేడాది ‘కావేరి ఫ్రమ్‌ నడుకావేరి’ వంటి చిత్రాల ద్వారా ఆనంది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International