తెలుగు మహిళ ‘వంటావార్పు’

Jul 30 2021 @ 01:14AM
అమలాపురంలో తెలుగు మహిళ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహిస్తున్న దృశ్యం

పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు నిరసన

అమలాపురం టౌన్‌, జూలై 29: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ అమలా పురం పార్లమెంటు జిల్లా శాఖ తెలుగుమహిళ అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి ఆధ్వర్యంలో గురు వారం అమలాపురం గడియారస్తంభం సెంటర్‌లో నిరసన తెలిపి వంటావార్పు కార్యక్రమం నిర్వ హించారు. పెరిగిన గ్యాస్‌ ధరలను భరించలేకపోతున్నామంటూ సిలెండర్లకు దండలువేసి వాటికి స్వస్తిచెప్పి కట్టెల పొయ్యిలపై వంటావార్పు నిర్వహించారు. నిరసన ప్రదర్శనకు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి అయితాబత్తుల ఆనందరావు, మాజీ ఎంపీ ఏజేవీబీ మహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి, రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి అధికారి జయవెంకటలక్ష్మిలు ముఖ్య అతిథులుగా పాల్గొని పెరి గిన ధరలను నిరసిస్తూ ప్రసంగించారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో మహిళల కంట కన్నీరు చూడకూడదని రాష్ట్రవ్యాప్తంగా దీపం పథకం కింద 24 లక్షల గ్యాస్‌ సిలెండర్లను అందిస్తే, నేడు జగన్‌ పాలనలో గ్యాస్‌ ధరలు మండిపోతున్నాయని ధ్వజమెత్తారు. నిత్యావసర వస్తువులతోపాటు పెరిగిన గ్యాస్‌ ధరలతో మహిళల కంట కన్నీటి ప్రవా హంతో జగన్‌ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గిం చాలని ప్లకార్డులు చేతబూని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసనలో మహిళా విభాగం ప్రతి నిధులు బొక్కా రుక్మిణి, మట్టపర్తి భారతి, దేవళ్ల వెంకటలక్ష్మి, వివిధ నియోజకవర్గాల అధ్యక్షులు గెల్లా మీనాకుమారి, సంసాని లక్ష్మీగౌరి, దాసరి జగదీశ్వరి, జాస్తి విజయలక్ష్మి, మాడా మాధవి, యాళ్ల వెంకట నాగ సుబ్బలక్ష్మి, మాకిరెడ్డి వీఎన్‌ఎస్‌ పూర్ణిమ, పేరూరి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.