అరబ్బు యజమాని చిత్రహింసలు.. సౌదీలో తెలుగోడి ఆత్మహత్య!

Published: Fri, 25 Mar 2022 07:21:09 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అరబ్బు యజమాని చిత్రహింసలు.. సౌదీలో తెలుగోడి ఆత్మహత్య!

నిను చూడలేక.. నేను రాలేక..

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎడారి దేశానికి.. 

యజమాని చిత్రహింసలు, తిండి లేక అనారోగ్యం

అరబ్బు షేక్‌ తప్పుడు కేసు.. స్వదేశం వెళ్లే దారి లేదు

ఉరి వేసుకున్న శ్రీనివాస్‌

(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో ఎడారి దేశానికి వెళ్లినా శ్రీనివాస్‌ కష్టాలు తీరలేదు. దేశంకాని దేశంలో, తనవారెవరూ లేని ప్రాంతంలో అరబ్బు యజమాని చిత్రహింసలు, తప్పుడు కేసులతో విలవిల్లాడాడు. గల్ఫ్‌లో సంపాదించే అవకాశం లేక, స్వదేశం వెళ్లే దారి కనిపించక చావే మార్గం అనుకున్నాడు. స్వదేశానికి ప్రాణాలతో వెళ్లలేక.. శవంగానైనా ఇంటికి చేరుకోవాలనే అత్యాశతో శ్రీనివాస్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 


యజమాని చిత్రహింసలు.. తప్పుడు కేసు

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌ గ్రామానికి చెందిన 36 ఏళ్ల శివరాత్రి శ్రీనివాస్‌ రెండున్నరేళ్ల క్రితం సౌదీ అరేబియాలోని రియాద్‌ నగరానికి వలస వెళ్లాడు. అక్కడ ఒక అరబ్బు యాజమాని ఇంట్లో డైవ్రర్‌గా పనికి కుదిరాడు. సౌదీలో డ్రైవర్ల ప్రధాన బాధ్యత పిల్లలను స్కూళ్లో దించి రావడం, తిరిగి ఇంటికి తీసుకెళ్లడం. అయితే, కరోనాతో స్కూళ్లన్నీ ఏడాదిన్నర పాటు మూసేయడంతో శ్రీనివా్‌సతో యజమాని ఇతర పనులన్నీ చేయించేవాడు. ఈ క్రమంలో తిండి సరిగ్గా లేక అనారోగ్యానికి గురైన అతడికి కడుపులో అల్సర్‌ ఏర్పడి అపరేషన్‌ చేశారు. కుట్లు ఆరక ముందే, పూర్తి విశ్రాం తి తీసుకోకుండానే శ్రీనివా్‌సను ఖర్జూరపు చెట్లు ఎక్కి పళ్లు కోయాలంటూ యజమాని చిత్రహింసలు పెట్టాడు. తట్టుకోలేక ఆ ఇంటి నుంచి పారిపోయిన శ్రీనివా్‌సపై తప్పుడు దొంగతనం కేసు పెట్టిన యజమాని వాంటెడ్‌ లిస్టులో పెట్టించాడు.


వీసా(అఖామా) తనిఖీల్లో పట్టుబడిన వారిని పోలీసులు జైళ్లకు తరలించి, అక్కడి నుంచి స్వదేశానికి పంపించడం ఆనవాయితీ. అయితే, శ్రీనివా్‌సపై కేసు పెండింగ్‌లో ఉండటంతో స్వదేశానికి పంపించలేదు. దీంతో రియాద్‌ నుంచి 400 కిలోమీటర్ల దూరంలోని దమ్మాం నగరానికి పారిపోయినా శ్రీనివా్‌సకు కష్టాలు తొలగిపోలేదు. స్వదేశం వెళ్లే మార్గం కనబడటం లేదంటూ భారత్‌లోని భార్య లక్ష్మితో తరచూ గోడు వెళ్లబోసుకునేవాడు. చివరికి జీవితంపై విరక్తి చెందిన శ్రీనివాస్‌ సోమవారం రాత్రి భార్యకు వీడి యో కాల్‌ చేసి కుటుంబానికి దూరంగా ఉండలేకపోతున్నానని, ఇక్కడ బతకలేకపోతున్నానని చెప్పి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. భారత రాయబార కార్యాలయం అధికారి నాజ్‌ సహకారంతో తెలుగు ప్రవాసీయులు శ్రీనివాస్‌ మృతదేహాన్ని స్వదేశానికి పంపించేయత్నాలు చేస్తున్నారు. వడ్డెర కులానికి చెందిన శ్రీనివాస్‌ తన ఇద్దరు ఆడ పిల్లల భవిష్యత్తు కోసమే ఎడారి దేశానికి వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.