హాంకాంగ్‌లో తెలుగు కుర్రాడి సినిమా

ABN , First Publish Date - 2020-09-20T12:22:00+05:30 IST

హాంకాంగ్‌ అమ్మాయి, ఇండియా అబ్బాయిల మధ్య చిగురించిన ప్రేమ కథ ఇతివృత్తంగా ‘మై ఇండియన్‌ బాయ్‌ఫ్రెండ్‌’ చిత్రం నిర్మాణం జరుపుకొంటోంది.

హాంకాంగ్‌లో తెలుగు కుర్రాడి సినిమా

హాంకాంగ్‌ అమ్మాయి, ఇండియా అబ్బాయిల మధ్య చిగురించిన ప్రేమ కథ ఇతివృత్తంగా ‘మై ఇండియన్‌ బాయ్‌ఫ్రెండ్‌’ చిత్రం నిర్మాణం జరుపుకొంటోంది. నల్గొండకు చెందిన శ్రీకిశోర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హాంకాంగ్‌లో స్థిరపడిన శ్రీకిశోర్‌ అక్కడి కల్చర్‌ను, ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలను మేళవించి ఈ సినిమా రూపొందిస్తున్నారు. గతంలో సశేషం, భూ, దేవి శ్రీ ప్రసాద్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీకిశోర్‌ ఈ సినిమా  ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరించడానికి ‘మై ఇండియన్‌ బాయ్‌’ చిత్రంతో ముందుకొస్తున్నారు. ఇందులోని నటీనటులందరు హాంకాంగ్‌ కు చెందిన వారే కావడం విశేషం. అలాగే సినిమా షూటింగ్‌ మొత్తం హాంకాంగ్‌లో నే పూర్తి చేశారు.


ద్విభాషా(హిందీ, కాన్టోనీస్‌) చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ప్రేక్షకులను అలరించేలా ఆరుపాటలు ఉన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో అనువాదం చేసి విడుదల చేయనున్నారు. కరణ్‌ చోలి హీరోగా, షిర్లీ చాన్‌ (హాంగ్‌ కాంగ్‌ నటి) హీరోయిన్‌గా నటిస్తున్నారు. తండ్రి పాత్రలో నటిస్తోన్న క్యూబోబో హాంకాంగ్‌లో మొదటి భారతీయ టీవీ నటుడిగా గుర్తింపు పొందారు. ద్విభాషా చిత్రంగా వస్తోన్న ఈ చిత్రానికి మన దేశంలో కూడా మంచి ఆదరణ లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు శ్రీకిశోర్‌.

Updated Date - 2020-09-20T12:22:00+05:30 IST