ఉత్సవ పూజల్లో పాల్గొన్న ట్రస్టు సభ్యులు
చౌదరిగూడ: మండల పరిధిలోని లాల్‌పహాడ్ చౌరస్తాలో నిర్మంచిన వేంకటేశ్వరస్వామి ప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా శనివారం పూజారి కారంపూడి నరసింహాచార్యులు, భాగవతుల వంశీకృష్ణ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. యాగశాల ప్రవేశం చేశారు. ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ప్రతిష్ఠ మహోత్సవాన్ని దిగ్విజయం చేయాలని ట్రస్ట్ చైర్మన్ సుధాకర్‌రావు తెలిపారు. రోజూ అన్నదానం ఉంటుందని తెలిపారు. కార్యక్రమాల్లో సంకోజి లక్ష్మీనారయణ, ఆకారపు నాగరాజు, గోపాల్‌రెడ్డి, సంజీవరెడ్డి, పడకంటి వెంకటేష్, మాధవరెడ్డి, రఘునందన్, గున్నాల శేఖర్, చందు, బోయ రాంచంద్రయ్య, భాస్కరచారి, మచ్చనవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.