పౌర్ణమి వేడుకకు ముస్తాబు

ABN , First Publish Date - 2020-11-30T04:32:40+05:30 IST

కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ముస్తాబుచేశారు.

పౌర్ణమి వేడుకకు ముస్తాబు
జిల్లా కేంద్రంలో విద్యుత్‌దీపాలతో ముస్తాబైన శివాలయం

మఠంపల్లి, నవంబరు 29: కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని  మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ముస్తాబుచేశారు. భక్తులు పెద్దసంఖ్యలో దేవాలయాలను సందర్శించి దీపో త్సవం, సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించే అవకాశం ఉండటంతో అం దుకు తగ్గట్లుఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్య ంగా నదీ స్నానానికి అవకాశం ఉన్న మట్టపల్లికి భక్తుల రాక ఎక్కువగా ఉండే నేపథ్యంలో భక్తులకు ప్రత్యేకఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మకర్త చెన్నూరి విజయ్‌కుమార్‌, ఈవో నవీన్‌లు తెలిపారు. అదేవిధంగా మఠంపల్లి, పెదవీడు, యాతవాకిళ్ళ, రఘునాథపాలెం, చౌటపల్లి తదితర గ్రామాల్లోని ఆలయాలను వేడుకలకు సిద్ధం చేశారు. 


సూర్యాపేటటౌన్‌: జిల్లాకేంద్రంలోని దేవాలయాలు కార్తీక పౌర్ణమి వేడుకలకు ముస్తాబయ్యాయి. జిల్లా కేంద్రంలోని రామలింగేశ్వరస్వామి దేవాలయం, అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి దేవాలయం, సంతోషిమాత దేవాలయాల్లో భక్తుల కోసం ఆలయ బాధ్యులు ఏర్పాట్లను పూర్తిచేశారు.  


నడిగూడెం: నడిగూడెం, శ్రీరంగాపురం షిర్డీసాయి ఆలయాలు, సిరిపురం, కాగితరామచంద్రపురం శివాలయాలు కార్తీకపౌర్ణమి వేడుకలకు ముస్తాబయ్యాయి. అభిషేకాలు, గోపూజ, జ్వాలాత్వరణం, దీపోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయాల నిర్వాహకులు తెలిపారు. 


సూర్యాపేట రూరల్‌: సూర్యాపేట మునిసిపాలిటీ విలీన గ్రామమైన పిల్లలమర్రి శివాలయంలో కార్తీకపౌర్ణమి వేడుకలు ఆదివారం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని దేవాలయ కమిటీ చైర్‌పర్సన్‌ గడ్డం ధనలక్ష్మీవెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. సూర్యా పేటతో పాటుగా ఇతర గ్రామాల నుంచి భక్తులు అఽధిక సంఖ్యలో దేవాలయానికి వచ్చి కార్తీకపౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నారు. రాత్రి వేళలో భక్తులు సామూహికంగా దీపాలను వెలిగించారు. ఎరకేశ్వరాలయంలోని శివలింగం, ఓంనమఃశివాయ ఆకృతిలో వెలి గించిన దీపాలు భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి.


హుజూర్‌నగర్‌  / హుజూర్‌నగర్‌ రూరల్‌: పట్టణంలోని వాసవీభవన్‌లో శివస్వాములు ఆదివారం మహారుద్రాభిషేకం, మండల పూజ నిర్వహించారు. కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు లక్షా 8 వేల రుద్రాక్షలతో మహారుద్రాభిషేకం, మండల పూజ నిర్వహించినట్లు శివస్వాములు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో యరగాని గురవయ్య, శ్రీనివాసు, వెంకటేశ్వర్లు, శ్రీను, యరగాని సత్యనారాయణగౌడ్‌, వట్టికూటి మహేష్‌, కిరణ్‌, గంగరాజు, నాగేశ్వరరావు, లింగరాజు, సైదులు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని బూరుగడ్డ పార్వతీరామలింగేశ్వరస్వామి దేవాలయంలో సహస్ర లింగార్చన నిర్వహించారు. కార్యక్రమంలో అరుణ్‌కుమార్‌, రాధిక, వెంకన్న, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 


నేరేడుచర్ల: నేరేడుచర్లలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, జనార్థనాచారి పాల్గొన్నారు. 


 అర్వపల్లి: తిమ్మాపురం సమీపంలోని అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో అయ్యప్పస్వాములు మహాసౌరహోమాన్ని ఘనంగా నిర్వహించారు. ద్వాదశ, ఆదిత్య క్షేత్రాల్లో కార్తీకపౌర్ణమి సందర్భంగా దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు క్షేత్ర వ్యవస్థాపకుడు కాకులారపు జనార్థన్‌రెడ్డి తెలిపారు. 2,516 దీపాలతో అలంకరణ చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-11-30T04:32:40+05:30 IST