వీరాంజనేయ ఆలయం ఏడో వార్షికోత్సవం

ABN , First Publish Date - 2021-04-23T05:26:25+05:30 IST

హుశేనాపురం గ్రామ భైరెడ్డినగర్‌లోని వీరాంజనేయస్వామి ఆలయ 7వ ప్రతిష్ఠ వార్షికోత్సవం గురువారం వైభవంగా జరిగింది.

వీరాంజనేయ ఆలయం ఏడో వార్షికోత్సవం

 ఓర్వకల్లు, ఏప్రిల్‌ 22: హుశేనాపురం గ్రామ భైరెడ్డినగర్‌లోని వీరాంజనేయస్వామి ఆలయ 7వ ప్రతిష్ఠ వార్షికోత్సవం గురువారం వైభవంగా జరిగింది.   సీతారాముల ఉత్సవ విగ్రహాలను  ఊరేగించారు. అర్చకులు మనోహర శర్మ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది.   ముఖ్య అతిథులుగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, కర్నూలు నగర మేయర్‌ బీవై రామయ్య హాజరై  మొక్కులు తీర్చుకున్నారు.  అనంతరం వీరాంజనేయస్వామి ఆలయ ముఖద్వారాన్ని ఎమ్మెల్యే కాటసాని ప్రారంభించారు. కళాకారులు వేసిన చెక్కభజన, సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.  


హోరాహోరీగా కబడ్డీ పోటీలు: ఆలయ ప్రతిష్ట వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను గురువారం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, కర్నూలు నగర మేయర్‌ బీవై రామయ్య, సర్పంచ్‌ చంద్ర గోవర్దనమ్మ ప్రారంభించారు. జిల్లాలోని వివిద ప్రాంతాల నుంచి 15 జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. విజేతలకు వరుసగా  రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు నగదును అందజేశారు.  

Updated Date - 2021-04-23T05:26:25+05:30 IST