ఆంజనేయస్వామి ఆలయంలో పేలిన గ్యాస్‌ సిలిండర్‌

ABN , First Publish Date - 2022-06-30T03:48:12+05:30 IST

మండలంలోని ఇందుపూరులో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది.

ఆంజనేయస్వామి ఆలయంలో  పేలిన గ్యాస్‌ సిలిండర్‌
కాలిపోయిన సామగ్రిని బయటకు తీస్తున్న ఆలయ సిబ్బంది

అల్లూరు, జూన్‌ 29 : మండలంలోని ఇందుపూరులో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఎస్‌ఐ శ్రీనివాసులురెడ్డి కథనం మేరకు.. వేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఆంజనేయస్వామి ఆలయం ఉంది. అక్కడ ప్రసాదాలు తయారీకి వినియోగించే 4 కిలోల చిన్న గ్యాస్‌ సిలిండర్‌ను ఆలయ గర్భగుడిలో ఉంచారు. ఈక్రమంలో బుధవారం సాయంత్రం ఆలయంలో పేలుడు శబ్దం విన్న స్థానికులు హుటాహుటిన అక్కడి వెళ్లి చూసేసరికి గ్యాస్‌ సిలిండర్‌ పేలి దుస్తులు, వంటసామగ్రి కాలిపోయాయి. వాటిని బయటకు తీసి మంటలను ఆర్పారు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ శ్రీనివాసులు రెడ్డి పరిశీలించారు. 

Updated Date - 2022-06-30T03:48:12+05:30 IST