దేవాలయాల సంరక్షణకు సహకరించాలి

ABN , First Publish Date - 2021-01-24T06:03:16+05:30 IST

అవనిగడ్డ సబ్‌ డివిజన్‌ పరిధిలో పూర్తిస్థాయిలో గ్రామరక్షక దళాలను ఏర్పాటు చేయటం జరిగిందని అవనిగడ్డ డీఎస్పీ ఎం.మహబూబ్‌ బాషా అన్నారు.

దేవాలయాల సంరక్షణకు  సహకరించాలి
అవనిగడ్డలో మాట్లాడుతున్న ఆర్డీవో ఖాజావలి

ఆర్డీవోలు ఖాజావలి, శ్రీనుకుమార్

గ్రామరక్షక దళాల ఏర్పాటు : డీఎస్పీలు మహబూబ్‌బాషా, సత్యానందం


అవనిగడ్డ టౌన్‌, జనవరి 23 : అవనిగడ్డ సబ్‌ డివిజన్‌ పరిధిలో పూర్తిస్థాయిలో గ్రామరక్షక దళాలను ఏర్పాటు చేయటం జరిగిందని అవనిగడ్డ డీఎస్పీ ఎం.మహబూబ్‌ బాషా అన్నారు. అవనిగడ్డలోని రెవెన్యూ సమావేశపు ప్రాం గణంలో జరిగిన గ్రామ రక్షక దళాల అవగాహన సదస్సుకు శ నివారం ముఖ్యఅతిథులుగా మచిలీపట్నం డివిజన్‌ ఆర్డీవో ఖాజావలి, డీఎస్పీ మహబూబ్‌ బాషా పాల్గొన్నారు.  ఆర్డీవో మాట్లాడుతూ మత వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా చర్యలు చేపడితే చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు. డీఎస్పీ మాట్లాడుతూ  శాంతిభద్రతలే ప్రధాన లక్ష్యంగా, అసాంఘిక శక్తుల ఆటలు సాగనివ్వకుండా, ఆయా గ్రామాలలోని ప్రజలను స్వచ్ఛందంగా భాగస్వామ్యం చేస్తూ గ్రామాల్లో రక్షక దళాలను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. సీఐలు  బి.బి.రవికుమార్‌, వెంకటనారాయణ, ఎస్సైలు, తహ సీల్దార్‌లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.


కైకలూరు : గ్రామాల్లో ఆలయాల పరిరక్షణ ప్రతి ప్రభుత్వ అధికారి బాధ్యత అని గుడివాడ ఆర్డీవో ఆర్‌.శ్రీనుకుమార్‌ అన్నారు.  కైకలూరులోని వ్యవసాయమార్కెట్‌ యార్డులోని  రైతు కల్యాణ మండపంలో శనివారం మతసామరస్య సాధన కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేవాలయాపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. డీఎస్పీ ఎం.సత్యానందం మాట్లాడుతూ గ్రామాల్లో ఉండే చిన్నచిన్న ఆలయాల రక్షణ కొరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. తహసీల్దార్‌లు సాయికృష్ణకుమారి, రవికాంత్‌, శ్రీనివాసరావు, శర్మ, ఎంపీడీవోలు, ఎస్సైలు, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.  






Updated Date - 2021-01-24T06:03:16+05:30 IST