ఆలయ రజతోత్సవ వేడుకలు ప్రారంభం

Published: Fri, 28 Jan 2022 00:06:46 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆలయ రజతోత్సవ వేడుకలు ప్రారంభంసాయి సప్తాహా పారాయణం ప్రారంభిస్తున్న దృశ్యం

ఖానాపూర్‌, జనవరి 27 : ఖానాపూర్‌ పట్టణంలోని వీరాంజనేయశివసాయిసమాజ్‌ ఆలయ వార్షికోత్సవ వేడుకలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు ఫిబ్రవరి 3వ తేదీ వరకు కొనసాగనున్నాయి. సాయి సచ్చరిత్ర పారాయణం ప్రారంభించారు. ఆలయ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఈ యేడాది వార్షికోత్సవ వేడుకలకు షిరిడీ సాయి సంస్థాన్‌ నుండి సాయిబాబా స్వయం పాదుకలు ఖానాపూర్‌కు తీసుకురానున్నారు. ఈ పాదుకలు సాయిబాబా జీవించి ఉన్న సమయంలో వేసుకున్న పాదుకలు అయినందున ఆల యానికి వచ్చే భక్తుల దర్శానార్ధం సాయి స్వయం పాదుకలను ఫిబ్రవరి 2 నుంచి రెండు రోజుల పాటు ఆలయంలో అందుబాటులో ఉంచనున్నారు. ఆలయ రజతోత్సవ వేడకుల ముగింపు రోజున నిర్వహించే మహాఅన్నదానంలో లక్ష మంది భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేయనున్నట్లు ఆలయకమిటీ అధ్యక్షులు బక్కశెట్టి కిషోర్‌ తెలిపారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.