ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో పుణ్యక్షేత్ర దర్శన యాత్రలు

ABN , First Publish Date - 2021-07-30T06:10:12+05:30 IST

పిలిగ్రిమ్‌ టూరిస్ట్‌ ట్రైన్‌, ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఉత్తర, దక్షిణ భారత పుణ్యక్షేత్ర యాత్రలు నిర్వహిస్తున్నట్లు టూరిజం డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ డీఎస్‌జీపీ కిషోర్‌కుమార్‌ తెలిపారు.

ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో పుణ్యక్షేత్ర దర్శన యాత్రలు
బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న రైల్వే అధికారులు

ఒంగోలు (కార్పొరేషన్‌), జూలై 29 : పిలిగ్రిమ్‌ టూరిస్ట్‌ ట్రైన్‌, ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఉత్తర, దక్షిణ భారత పుణ్యక్షేత్ర యాత్రలు నిర్వహిస్తున్నట్లు టూరిజం డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ డీఎస్‌జీపీ కిషోర్‌కుమార్‌ తెలిపారు. గురువారం ఒంగోలులోని రైల్వే వీఐపీలాంజ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 27వ తేదీ నుంచి ఉత్తర భారత యాత్ర మొదలువుతుందన్నారు. రేణిగుంట స్టేషన్‌ నుంచి మొదలయ్యే ప్రత్యేక ట్రైన్‌ నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, నల్లగొండ, సికింద్రాబాద్‌, కాజీపేటలో యాత్రికులు రైలు ఎక్కవచ్చని చెప్పారు. ఈ యాత్రలో భాగంగా ఆగ్రా, మధుర, వైష్ణోదేవి, అమృత్‌సర్‌, హరిద్వార్‌, ఢిల్లీ పుణ్యక్షేత్రాల సందర్శన ఉంటుందని తెలిపారు. పదిరాత్రులు, 11 పగళ్లు ఈ యాత్ర ఉంటుందన్నారు. అదేవిధంగా అక్టోబరు 19వ తేదీ నుంచి దక్షిణ భారత యాత్ర ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యాత్రికులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జోన్‌ మేనేజర్‌ మురళీ, ఒంగోలు స్టేషన్‌ మాస్టర్‌ ఏసుదానం, పలువురు రైల్వే అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-30T06:10:12+05:30 IST