రంగడి హుండీ ఆదాయం రూ.16.71 లక్షలు

ABN , First Publish Date - 2022-01-25T04:38:52+05:30 IST

నగరంలోని తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో సోమవారం హుండీల లెక్కింపు జరిగింది. 2021 అక్టోబరు 8వ తేదీ నుంచి 2022 జనవరి 24వ తేదీ వరకు భక్తులు వేసిన కానుకలు లెక్కించగా 13,10,376 రూపాయలు వచ్చాయి.

రంగడి హుండీ ఆదాయం రూ.16.71 లక్షలు
రంగనాఽథస్వామి ఆలయంలో నగదు లెక్కిస్తున్న సిబ్బంది

నెల్లూరు(సాంస్కృతికం), జనవరి 24: నగరంలోని తల్పగిరి రంగనాథస్వామి  ఆలయంలో సోమవారం హుండీల లెక్కింపు జరిగింది. 2021 అక్టోబరు 8వ తేదీ నుంచి 2022 జనవరి 24వ తేదీ వరకు భక్తులు వేసిన కానుకలు లెక్కించగా 13,10,376 రూపాయలు వచ్చాయి.  2022 జనవరి 1 నుంచి వైకుంఠ ఏకాదశి, పగల్‌ పత్తు, రాపత్తు ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక హుండీలు లెక్కించగా 3,67,161 రూపాయలు వచ్చాయి. మొత్తం 16,71,537 రూపాయలు వచ్చాయి. గత సంవత్సరం ఇదే రోజుల్లో వచ్చిన ఆదాయం కంటే ఈ సంవత్సరం 1,26,123 రూపాయల ఆదాయం అదనంగా వచ్చిందని ఈవో డీ.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పర్యవేక్షణాధికారిగా దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌కే చైతన్య, చైర్మన్‌ ఇలపాక శివకుమార్‌ఆచారి, ధర్మకర్తల మండలి సభ్యులు మిరియాల శిగామి, టీవీ. నరశింహాచార్యులు, దేవాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-25T04:38:52+05:30 IST