పది రోజులు ముందుగానే

Published: Tue, 24 May 2022 00:35:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పది రోజులు ముందుగానే

మేజర్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథని ఆధారంగా చేసుకుని రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘మేజర్‌’. అడవిశేష్‌ కథానాయకుడు. శోభిత ఽధూళిపాళ, ప్రకాష్‌రాజ్‌, రేవతి కీలక పాత్రలు పోషించారు. జూన్‌ 3న రాబోతోంది. అయితే... విడుదలకు పది రోజుల ముందే, అంటే మే 24 నుంచే ‘మేజర్‌’ ప్రీమియర్‌ షోల హడావుడి మొదలుకానుంది. దేశ వ్యాప్తంగా 9 ప్రధానమైన నగరాల్లో ‘మేజర్‌’ని ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, కొచ్చి, ముంబై, బెంగళూరులాంటి నగరాల్లోని ప్రేక్షకులు బుక్‌ మై షో ద్వారా టికెట్‌ కొనుగోలు చేసుకొని ‘మేజర్‌’ని అందరికంటే ముందే చూసేయొచ్చు. ‘‘మేజర్‌ ప్రతి ఒక్క భారతీయుడు చూడవలసిన చిత్రం. చాలా బాగా వచ్చింది. దేశ వ్యాప్తంగా అందరూ ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అందుకే ఎప్పుడూ లేనివిధంగా పది రోజుల ముందే ప్రీమియర్‌ షోలను ప్రదర్శిస్తున్నామ’’ని చిత్రబృందం తెలిపింది. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International