10 జిల్లాల్లో Covid కేసులు నిల్‌

Published: Sat, 20 Nov 2021 11:26:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
10 జిల్లాల్లో Covid కేసులు నిల్‌

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితి క్రమేపీ నియంత్రణలోకి వస్తోందని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ వెల్లడించారు. బెంగళూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక రాజధాని బెంగళూరులో మినహా రాష్ట్రంలో మిగతా అన్ని జిల్లాల్లో కొవిడ్‌ పూర్తిగా నియంత్రణలో ఉందన్నారు. బెంగళూరులో శుక్రవారం 144 కొత్త కేసులు వెలుగు చూడగా ఇద్దరు చనిపోయారన్నారు. ఇక బాగల్‌కోటె బళ్ళారి, బీదర్‌, చిక్కబళ్ళాపుర, దావణగెరె, కలబుర్గి, కోలార్‌, కొప్పళ, రాయచూరు, రామనగర్‌లలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా వెలుగు చూడలేదన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.