అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న హెచ్ఎంలు
- తెలంగాణ రాష్ట్ర పీజీ హెచ్ఎంల సంఘం వినతి
పెద్దపల్లి కల్చరల్, మార్చి 26 : పదో తరగతి వార్షిక పరీక్షలను ఏప్రిల్ చివరివా రంలో నిర్వహించాలని పీజీ హెచ్ఎంల సంఘం అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందించారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు సిలబస్ బోధన పూర్తి అయినప్పటికి, ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు రివిజన్ టెస్టులు జరుగుతు న్నాయన్నారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 23 పాఠశాలలకు చివరి పని దినం. నెలరోజుల గ్యాప్ అనంతరం విద్యార్థులు పరీక్షలు నిర్వహించడం వలన అది ఫలితాలపై ప్రభావం చూపుతుందన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా వార్షిక పరీక్షలను మాసంలోని చివరివారంలో నిర్వహించుటకు రీషెడ్యూల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకన కేంద్రాలు 33జిల్లాల్లో ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఎన్.సుదర్శనం, ప్రదాన కార్యదర్శి సురేంద్రకుమార్, భూపతి ,శ్రీనివాస్‌లు ఉన్నారు.