Kuwait: 10 మంది ప్రవాసుల అరెస్ట్.. ఇంతకీ వారు చేసిన నేరమేంటంటే..

ABN , First Publish Date - 2022-09-18T19:15:34+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Kuwait: 10 మంది ప్రవాసుల అరెస్ట్.. ఇంతకీ వారు చేసిన నేరమేంటంటే..

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తరచూ తనిఖీలు నిర్వహిస్తూ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిని వెంటనే దేశం నుంచి బహిష్కరిస్తోంది. ఇదే కోవలో తాజాగా మరో 10 మంది వలసదారులను అదుపులోకి తీసుకుంది. వీరందరూ రెసిడెన్సీ చట్టాన్ని(Residence law) ఉల్లంఘించినట్లు తేల్చింది. కాగా, వీరిలో 9 మంది యజమానుల నుంచి తప్పించుకుని పరారీలో (absconders) ఉన్నవారు ఉంటే.. ఒకరు గడువు ముగిసిన వీసాతో దేశంలో ఉంటున్నట్లు అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. పది మంది కూడా వేర్వేరు దేశాలకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. అనంతరం వారిని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించింది. అక్కడ వారి స్పాన్సర్‌లను పిలిచి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుతుందన్నారు. అనంతరం వారి నుంచి ప్రవాసులకు ప్రయాణ ఖర్చులను వసూలు చేయనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత వలసదారులను వారివారి దేశాలకు పంపించడం జరుగుతుందని అధికారులు చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-09-18T19:15:34+05:30 IST