పది, ఇంటర్‌ పరీక్షలను వెంటనే రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-04-24T04:31:00+05:30 IST

కరోనా ఉధృతి దృష్ట్యా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం 10,ఇంటర్‌పరీక్షలను రద్దు చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్‌రాయులు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

పది, ఇంటర్‌ పరీక్షలను వెంటనే రద్దు చేయాలి

 టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్‌రాయులు

రాజంపేట, ఏప్రిల్‌23 : కరోనా ఉధృతి దృష్ట్యా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం 10,ఇంటర్‌పరీక్షలను రద్దు చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్‌రాయులు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షలను రద్దు చేస్తే జగన్‌ రెడ్డి ప్రభుత్వం పరీక్షలను నిర్వహిస్తామని మొండిగా వ్యవహరించడం దారుణమన్నారు. వైద్య నిపుణుల సూచనల మేరకు వెంటనే ఇంటర్‌, 10 పరీక్షలు రద్దు లేదా వాయిదా చేయాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా రాజంపేట ప్రాంతంలోని వీరబల్లి, సుండుపల్లె, రాజంపేట మండలాల్లో ఈదురుగాలులకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-04-24T04:31:00+05:30 IST