తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు రూ. 10 లక్షలు చెల్లించాలి

ABN , First Publish Date - 2021-06-24T04:45:27+05:30 IST

కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల ఖాతాల్లో తక్షణం రాష్ట్ర ప్రభుత్వం రూ. 10లక్షలు జమ చేయాలని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు రూ. 10 లక్షలు చెల్లించాలి
నెలవలను పరామర్శిస్తున్న మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

 మాజీమంత్రి సోమిరెడ్డి 

నాయుడుపేట, జూన్‌ 23 : కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల ఖాతాల్లో తక్షణం రాష్ట్ర ప్రభుత్వం రూ. 10లక్షలు జమ చేయాలని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి  డిమాండ్‌ చేశారు. ఇటీవల టీడీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం అల్లుడు రవిచంద్ర అనారోగ్యంతో మృతిచెందారు. బుధవారం సోమిరెడ్డి నాయుడుపేట పిచ్చిరెడ్డితోపులో నెలవలను పరామర్శించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో బీమా పథకాన్ని ఎలా అమలు చేస్తున్నారో వైసీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వ హయాంలోని బీమా పథకానికి పేరు మార్చినా పాత పద్ధతిలోనే అమలు చేస్తే ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు గూడూరు రఘునాథరెడ్డి, తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి, నాయకులు గాలి రమేష్‌నాయుడు, వేలూరు మురళీకృష్ణారెడ్డి, డాక్టర్‌ శ్రీపతి బాబు, శివయ్య, అత్తికాయల సుబ్రహ్మణ్యం, నానాబాల సుబ్బారావు, నారాయణ పాల్గొన్నారు. 

తడ : టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బుధవారం తడ మండలం గ్రద్దగుంట  గ్రామానికి వచ్చారు. మండల నాయకులతో కొద్దిసేపు పిచ్చాపాటిగా మాట్లాడారు. సోమిరెడ్డిని కలసినవారిలో వేనాటి సతీష్‌రెడ్డి, కామిరెడ్డి మురళీరెడ్డి, నీలకంఠం, సెల్వం, జీవా ఉన్నారు. 


Updated Date - 2021-06-24T04:45:27+05:30 IST