పది పాసైన బాలికలను ఇంటర్‌లో చేర్పించాలి

ABN , First Publish Date - 2022-07-07T04:59:03+05:30 IST

పదో తరగతి పూర్తి చేసిన బాలికలంతా ఇంటర్‌లో చేరేలా గ్రామ సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్లు పర్య వేక్షించాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ఆదే శించారు.

పది పాసైన బాలికలను ఇంటర్‌లో చేర్పించాలి
సచివాలయ ఉద్యోగులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

వెల్ఫేర్‌ అసిస్టెంట్లకు కలెక్టర్‌ ఆదేశం

బేస్తవారపేట, జూలై 6 : పదో తరగతి పూర్తి చేసిన బాలికలంతా ఇంటర్‌లో చేరేలా గ్రామ సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్లు పర్య వేక్షించాలని కలెక్టర్‌  ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ఆదే శించారు. బుధవారం బేస్తవారపేట సచివాలయం-1ని ఆయన సందర్శించి సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. సచివాలయం పరిధిలో ఎంత మంది బాలికలు 10వతరగతి పాస య్యారో వారి వివరాలు తెలుసుకోవాలన్నారు. వాళ్ల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి ఇంటర్‌లో చేరేలా అవగాహన కల్పించాని కలెక్టర్‌ అన్నారు.  పాఠశాల ప్రధానోపాధ్యా యుని సహకారంతో ముందుకు వెళ్లాలన్నారు. ఎంతమందిని పై తరగతుల్లో చేర్చారో వివరా లను తనకు పంపించాలని అధికారులకు సూ చించారు.  బడిఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలన్నారు. సచివాలయ పరిధిలో బా ల్య వివాహాలు జరగకుండా చూడాలని కలెక్టర్‌ సృష్టం చేశారు. సచివాలయానికి వస్తున్న అర్జీ లను నిర్థిష్ట గడువులోగా పరిష్కారించాల న్నారు. స్వచ్ఛ సంకల్పంలో  భాగంగా పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిం చాలన్నారు. పంటల బీమా, ఓటీఎస్‌ కార్యక్రమాలపై చర్చించారు. బీసీ కాలనీలో ప్రధాన రోడ్డు, శ్రీచౌడేశ్వరమ్మదేవి ఆలయం ఎదురు  రోడ్డుపై నీటి నిల్వతో  ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ ది నేష్‌కుమార్‌ ఆదేశించారు. ఆయనవెంట ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతి, ఎంపీడీవో చెన్న కేశవరెడ్డి, ఏపీవో సురేష్‌బాబు, డిప్యూటీ తహసీల్దార్‌  జి తేంద్ర కుమార్‌, వీఆర్వో సుబ్బరామిరెడ్డి,  కార్యదర్శి జి.రాఘవరావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-07T04:59:03+05:30 IST