West Bengal electrocution death: పికప్ వ్యానులో విద్యుదాఘాతం...10మంది ప్రయాణికుల మృతి

ABN , First Publish Date - 2022-08-01T13:29:11+05:30 IST

పశ్చిమబెంగాల్(West Bengal) రాష్ట్రంలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది.....

West Bengal electrocution death: పికప్ వ్యానులో విద్యుదాఘాతం...10మంది ప్రయాణికుల మృతి

కూచ్ బెహార్ (పశ్చిమబెంగాల్): పశ్చిమబెంగాల్(West Bengal) రాష్ట్రంలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. డీజే సిస్టం ఉన్న పికప్ వ్యానులో ఆదివారం రాత్రి జనరేటర్ విద్యుత్ వైరు తగిలి విద్యుదాఘాతం(Electrocution) జరిగింది. ఈ విద్యుత్ ప్రమాద దుర్ఘటనలో 10 మంది కన్వారియాలు మరణించారు(electrocution death). వ్యానులో ఉన్న మరో 19 మంది గాయపడటంతో వారిని చికిత్స కోసం జల్పాయిగురి ఆసుపత్రికి తరలించారు. జనరేటర్ ఉన్న పికప్ వ్యానులో ప్రయాణికులు కూచ్ బెహార్(Cooch Behar) నుంచి జల్పేష్ పట్టణానికి వెళుతుండగా ధార్ల బ్రిడ్జి వద్ద విద్యుదాఘాతం జరిగింది. డీజే సిస్టం జనరేటర్ కు ఉన్న విద్యుత్ వైరు వ్యాను వెనుక కట్టడంతో అందులో విద్యుత్ ప్రసరించి(electrocution vs shock) వ్యానులో ఉన్న వారికి కరెంట్ షాక్ తగిలిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ అమిత్ వర్మ చెప్పారు.


విద్యుదాఘాతానికి గురైన పికప్ వ్యానులో 27 మంది ప్రయాణికులుండగా వారిలో 10 మంది మరణించారని వైద్యులు ప్రకటించారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడటంతో వారిని మెరుగైన చికిత్స కోసం జల్పాయిగురి జిల్లా ఆసుపత్రికి తరలించామని వైద్యులు చెప్పారు.ఈ దుర్ఘటనలో మృతులంతా సీతల్ కూచి ప్రాంతవాసులని పోలీసులు చెప్పారు. వ్యానును సీజ్ చేశామని, డ్రైవరు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. విద్యుదాఘాతం ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పశ్చిమబెంగాల్ పోలీసులు చెప్పారు. 


Updated Date - 2022-08-01T13:29:11+05:30 IST