స్మార్ట్‌ ఫోన్‌లో పది సెన్సర్లు

ABN , First Publish Date - 2021-09-04T06:12:18+05:30 IST

రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ అంటే కేవలం కమ్యూనికేషన్‌కు పరిమితం కావడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే అంతకు మించి.

స్మార్ట్‌ ఫోన్‌లో పది సెన్సర్లు

రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ అంటే కేవలం కమ్యూనికేషన్‌కు పరిమితం కావడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే అంతకు మించి. ఆన్‌లైన్‌ లావాదేవీలు మొదలుకుని ఆరోగ్యం వరకు అన్నింటికీ స్మార్ట్‌ ఫోనే నేడు ఒక నమ్మకమైన ఆధారం. ఈ యావత్తు వ్యవహారం సెన్సర్లతోనే జరుగుతుంది. ఫేస్‌ ఐడీ, ఫింగర్‌ ప్రింట్స్‌ స్కానర్లకు కూడా సెన్సర్లు ఉంటున్నాయి. స్మార్ట్‌ ఫోన్‌ల్లో ఉండే అలాంటి పది సెన్సర్ల గురించి చూద్దాం... 


ప్రాక్సిమిటీ సెన్సర్‌: పేరుకు తగ్గట్టే ఫోన్‌కు దగ్గర్లో ఉన్న వస్తువును ఇది కనుగొంటుంది. కాల్‌ సమయంలో చెవికి దగ్గర్లో ఉన్నప్పుడు స్మార్ట్‌ ఫోన్‌లోని డిస్‌ప్లేని ఆఫ్‌ చేస్తుంది. దీంతో అనుచిత లేదా అనుకోకుండా టచ్‌ అయ్యి కాల్‌ కట్‌ కావడానికి ఆస్కారం ఉండదు. పైపెచ్చు బ్యాటరీని ప్రిజర్వ్‌ చేసుకునే వీలు ఉంటుంది. 


యాక్సిలిరోమీటర్‌: డివైస్‌ ఓరియెంటేషన్‌ను ఇది నిర్దేశిస్తుంది. స్మార్ట్‌ ఫోన్‌ పోట్రయిట్‌ లేదా లాండ్‌స్కేప్‌ మోడ్‌లో ఉందో ఈ సెన్సర్‌ డిటెక్ట్‌ చేస్తుంది. అందుకు అనుగుణంగా స్ర్కీన్‌పై కంటెంట్‌ను ఆప్టిమైజ్‌ చేస్తుంది. అందుకు మంచి ఉదాహరణ  యూట్యూబ్‌లో వీడియో చూస్తున్నప్పుడు అది రొటేట్‌ చేసుకోవచ్చు. నిలువుగా ఉంటే తక్కువగా కనిపించే సీన్‌ అడ్డంగా ఉన్నప్పుడు మరింత బాగా చూసే వీలు కలిగిస్తుంది. 


గైరోస్కోప్‌: స్మార్ట్‌ ఫోన్లలో ఇది  యాక్సిలిరోమీటర్‌తో కలిసి పనిచేస్తుంది. మూవ్‌మెంట్‌కు అదనపు డైమన్షన్‌ అలాగే బెటర్‌ మోషన్‌ అంటే రొటేషన్‌ లేదా ట్విస్ట్‌కు ఈ సెన్సర్‌ తోడ్పడుతుంది. 360 డిగ్రీల్లో ఫొటోను వీక్షించే సౌకర్యం దీంతో కలుగుతుంది. రేసింగ్‌ టైటిల్స్‌ గేమ్స్‌ ఆడేటప్పుడు టిల్ట్‌ అంటే కుడి లేదా ఎడమ వైపు తిప్పుకొనేందుకు ఉపకరిస్తుంది. 


డిజిటల్‌ కంపాస్‌: భూమికి సంబంధించిన డేటాను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. రియల్‌ వరల్డ్‌ డైరెక్షన్‌ అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం తెలుసుకోగలం. ఇది మేగ్నోమీటర్‌ ఆధారితం. స్మార్ట్‌ ఫోన్‌లో మేప్‌లను చూసేటప్పుడు ఇది ఉపకరిస్తుంది. 


జీపీఎస్‌: ‘గ్లోబల్‌ పొజిషినింగ్‌ సిస్టమ్‌’ టెక్నాలజీ దీని పూర్తి పేరు. ప్రస్తుత లొకేషన్‌ లేదంటే ఉపగ్రహం సహాయంతో  చేరుకోవాల్సిన గమ్యాన్ని తెలియజేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ డేటాతో దీనికి పనిలేదు. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకున్నా మీ స్మార్ట్‌ ఫోన్‌లో మేప్‌ సౌకర్యం ఉంటే చాలు, వినియోగించుకోవచ్చు. 


బారోమీటర్‌: రెండు ప్రధాన టాస్క్‌లు దీంతో సాధ్యమవుతాయి. లొకేషన్‌ను వేగంగా తెలుసుకునేందుకు దీంతో వీలవుతుంది. అట్మాస్ఫియరిక్‌ ప్రెజర్‌ను లెక్కించేందుకు ఇన్‌స్ట్రుమెంట్‌గా ఉపయోగపడుతుంది. హెల్త్‌ యాప్‌లో ఫ్లోర్‌ క్లయింబింగ్‌ సమాచారం అలాగే టెంపరేచర్‌ కనుగొనవచ్చు. 


బయోమెట్రిక్స్‌: యూనిక్‌ బయోమెట్రిక్‌తో అదనపు సెక్యూరిటీ లభిస్తుంది. అంటే ఫింగర్‌ ప్రింట్‌, ఐరిస్‌, ఫేసియల్‌ డేటాతో ఈ సౌకర్యం ఒనగూరుతుంది. పేమెంట్‌కు అథంటికేషన్‌కు అన్‌లాకింగ్‌తో ఉపయోగపడుతుంది. ఎస్‌పీఓ2 రీడింగ్‌, హార్ట్‌ రేటు తెలుసుకునేందుకు ఈ సెన్సర్‌ పనికొస్తుంది. 


ఎన్‌ఎఫ్‌సీ:నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌’ అంటే పది సెం.మీ. దూరంలోని రెండు డివైస్‌ లలోని సమాచారాన్ని సులువుగా షేర్‌ చేసుకోవచ్చు. గూగుల్‌ పే, శామ్‌సంగ్‌ పే, యాపిల్‌ పే తదితర  పేమెంట్‌ అప్లికేషన్స్‌కు కూడా ఇది ఉపయోగపడుతుంది.  బ్లూటూత్‌ కంటే దీనికే ఎక్కువ భద్రత ఉందంటున్నారు.

 

పెడోమీటర్‌: డిజిటల్‌ డివైస్‌లో స్టెప్‌ డేటాకు ఇది ఉపయోగపడుతుంది. స్మార్ట్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌ల వంటి వేరియబుల్స్‌లో ఈ సెన్సర్‌  ఉంటుంది. ముఖ్యంగా హెల్త్‌ యాప్స్‌లో యూజర్‌ అడుగుల లెక్కల కచ్చితత్వం కోసం ఇది  ఉపయోగపడుతుంది. 


యాంబియెంట్‌ లైట్‌ సెన్సర్‌: లైటింగ్‌ ఇంటెన్సిటీని కనుగొనేందుకు ఉపయోగపడుతుంది. చుట్టుపక్కల వెలుతురును అనుసరించి స్ర్కీన్‌ బ్రైట్‌నెస్‌ను సరిచేసుకుంటుంది.  స్మార్ట్‌ఫోన్‌, లాప్‌టాప్‌, టీవీలు, ఆటోమేటివ్‌ డిస్‌ప్లేలలో ఇది పాపులర్‌. కారులోని అద్దాల్లో ఉండే ఆటో డిమ్మర్‌ ఇదే  సెన్సర్‌తో పనిచేస్తుంది. 

Updated Date - 2021-09-04T06:12:18+05:30 IST