Uttarakhandలో యమునోత్రి హైవేపై కూలిన safety wall...10వేల మంది చిక్కుకుపోయారు

ABN , First Publish Date - 2022-05-21T16:08:40+05:30 IST

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని యమునోత్రి జాతీయ రహదారిపై భద్రతా గోడ కూలిపోవడంతో 10వేలమంది యాత్రికులు చిక్కుకుపోయారు...

Uttarakhandలో యమునోత్రి హైవేపై కూలిన safety wall...10వేల మంది చిక్కుకుపోయారు

డెహ్రాడూన్: Uttarakhand రాష్ట్రంలోని యమునోత్రి జాతీయ రహదారిపై భద్రతా గోడ కూలిపోవడంతో 10వేలమంది యాత్రికులు చిక్కుకుపోయారు.యమునోత్రి ఆలయానికి వెళ్లే జాతీయ రహదారిపై సేఫ్టీ వాల్ కూలడం వల్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆలయానికి వెళ్లే ఈ రోడ్డును తెరవడానికి మూడు రోజులు పట్టవచ్చని అధికారులు చెప్పారు. ఆలయానికి వచ్చిన యాత్రికులను చిన్న వాహనాల్లో తరలించేందుకు ఉత్తరాఖండ్ అధికారులు యత్నిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి పెద్ద వాహనాల్లో వచ్చిన యాత్రికులు తిరిగి వెళ్లలేక చిక్కుకుపోయారు. 


Updated Date - 2022-05-21T16:08:40+05:30 IST