
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమమంలో ఇచ్చిన విభజన హామీల అమలుకు పదేళ్ల సమయం పడుతుందని కేంద్ర హోంశాఖ తెలిపింది. టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సమాధానం ఇచ్చింది. విభజన హామీల అమలు పనులు కొన్ని పలు దశల్లో ఉన్నాయని పేర్కొంది. హామీల అమలుపై హోంశాఖ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తోందని పేర్కొంది. ఇప్పటివరకు కేంద్రహోం శాఖ 25 సమీక్షలు నిర్వహించిందని తెలిపింది.
ఇవి కూడా చదవండి