Tenaliలో త్రిముఖ పోరు.. గెలుపు ఎవరిదో..!

ABN , First Publish Date - 2022-07-19T00:00:18+05:30 IST

ఆంధ్రాపారిస్‌ గా ప్రసిద్ధి పొందింది. గుంటూరు జిల్లా లో ఇది కీలక నియోజకవర్గం. మాజీ ముఖ్యమంత్రులు నాదెండ్ల భాస్కరరావు....

Tenaliలో త్రిముఖ పోరు.. గెలుపు ఎవరిదో..!

తెనాలి (Tenali).. ఆంధ్రాపారిస్‌ (Andhraparis)గా ప్రసిద్ధి పొందింది. గుంటూరు జిల్లా (Guntur District)లో ఇది కీలక నియోజకవర్గం. మాజీ ముఖ్యమంత్రులు నాదెండ్ల భాస్కరరావు (Nadendla Bhaskara Rao), కొణిజేటి రోశయ్య (Konijeti Rosaih) తెనాలి నుంచి పోటీ చేసినవారే. అలాగే అన్నాబత్తుని సత్యాన్నారాయణ (Annabattuni Satyanarayana), ఆలపాటి వెంకట్రామయ్య (Alapati Venkatramaiah) వంటి ఘటికులూ ఇక్కడ నుంచే గెలిచారు. మంత్రులూ అయ్యారు. ఇక జనసేన (Janasena)లో నెంబర్‌ టూగా ఉన్న నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar).. తెనాలి నుంచి పోటీ చేశారు. మూడు సార్లు కాంగ్రెస్‌ (Congress) నుంచి పోటీ చేసి రెండు పర్యాయాలు గెలిచారు. 2019లో జనసేన తరపున బరిలోకి దిగి మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఈయనపై వైసీపీ తరపున అన్నాబత్తుని శివకుమార్‌, టీడీపీ నుంచి మాజీ ఆలపాటి రాజా పోటీ చేశారు. ఈ త్రిముఖ పోరులో వైసీపీ అభ్యర్థి శివకుమార్‌ గెలుపొందారు. ఇక రానున్న ఎన్నికల్లోనూ ఈ ముగ్గురే మరోసారి బరిలోకి దిగుతారనే ప్రచారం సాగుతోంది. 


తెనాలి నుంచి కాక మరో నియోజకవర్గం నుంచి ...

తొలుత నాదెండ్ల మనోహర్‌ తెనాలి నుంచి కాక మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే గుసగుసలు వినిపించాయి. కానీ ఆయన తెనాలి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ (Mla Annabattuni Sivakumar) మరోసారి వైసీపీ నుంచి పోటీకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అటు టీడీపీ నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజా(Tdp Ex Minister Alapati Raja)నే పోటీ చేస్తారని భావిస్తున్నారు. 


విజయం ఎవరిదో...

అయితే తెనాలి రూరల్ మండలంలో కాపులు, కొల్లిపర మండలంలో రెడ్లు, తెనాలి పట్టణంలో కమ్మ ఓటర్లు ఆధిక సంఖ్యలో ఉన్నారు. మూడు ప్రధాన పార్టీల నుంచి పోటీకి దిగే ముగ్గురు అభ్యర్ధులు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే కావటంతో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.



Updated Date - 2022-07-19T00:00:18+05:30 IST