Police overaction: తెనాలిలో పోలీసుల పక్షపాతం

ABN , First Publish Date - 2022-09-03T18:49:54+05:30 IST

జిల్లాలోని తెనాలిలో పోలీసులు పక్షపాతం చూపారు. మున్సిపల్ ఆఫీస్ ముందు వైసీపీ వారితో అన్నదానం పెట్టించారు.

Police overaction: తెనాలిలో పోలీసుల పక్షపాతం

గుంటూరు: జిల్లాలోని తెనాలిలో పోలీసులు (Police) పక్షపాతం చూపారు. మున్సిపల్ ఆఫీస్ ముందు వైసీపీ (YCP) వారితో అన్నదానం పెట్టించారు. పురవేదిక వద్ద పేదలకు  టీడీపీ నేతలు (TDP Leaders) అన్నం పెడుతున్నారు. దీంతో వైసీపీ అన్నదానం వైపు పేదలు ఆసక్తి చూపని పరిస్థితి. టీడీపీ అన్నం దానం వద్ద భోజనం చేస్తున్న పేదల నుంచి కక్ష్య పూరితంగా టీడీపీ ఆహార పదార్థాలను పోలీసులు లాక్కెళ్లారు. అన్నదానం చేసే టీడీపీ వర్గీయలపై దాడి చేశారు. ఈ క్రమంలో టీడీపీ, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటలు చోటు చేసుకుంది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా టీడీపీ ఆందోళన చేపట్టింది. 

Updated Date - 2022-09-03T18:49:54+05:30 IST