మనోహరంగా వైకుంఠుని బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2022-05-19T05:06:47+05:30 IST

వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం స్వామివారి కల్యాణ మండపంలో భక్తుల గోవింద నామస్మరణతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.

మనోహరంగా వైకుంఠుని బ్రహ్మోత్సవాలు
వైకుంఠుని బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున పెండ్లి కుమారుడిగా స్వామివారు

తెనాలి టౌన్‌,  మే 18 :  వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం స్వామివారి కల్యాణ  మండపంలో భక్తుల గోవింద నామస్మరణతో అత్యంత  వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చక పండితులు స్వామివారికి మంగళ స్నానాలు చేయించి పెండ్లి కుమారునిగా తీర్చిదిద్దారు. వేద పండితులు చక్కని వాచకంతో బ్రహ్మోత్సవాల ప్రాధాన్యతను వివరిస్తూ ఆథ్యాత్మిక ఉపన్యాసం చేశారు. రాత్రి 7గంటలకు బ్రహ్మోత్సవాల ప్రారంభం వేడుకలో ముఖ్య ఘట్టమైన అంకురారోపణ, ధ్వజారోహణ కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి వేడుకలను భక్తి శ్రద్దలతో తిలకించారు. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 3వరకు పి.వి.ఏ. ప్రసాద్‌ బృందం అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు. ఇ.వో ఎం.తిమ్మానాయుడు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ ఛైర్మన్‌ వుప్పల వరద రాజులు, ఇనస్పెక్టర్‌ సాదినేని శ్రీనివాసరావు, అర్చకులు అలహరి రవి, రమణతదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-19T05:06:47+05:30 IST