వ్యభిచార గృహ నిర్వహణ.. యజమానికి ఊరట

Published: Sun, 27 Mar 2022 17:49:32 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వ్యభిచార గృహ నిర్వహణ.. యజమానికి ఊరట

యజమానికి తెలియకుండా అతడి ఇంట్లో వ్యభిచారం జరిగిందని, కాబట్టి ఈ విషయంలో అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని పోలీసులకు సూచించింది కర్ణాటక హైకోర్టు. బెంగళూరుకు చెందిన ప్రభురాజ్ అనే వ్యక్తి స్థానిక నగరభావిలో ఉన్న తన ఇంటిని 2019 డిసెంబర్‌లో అద్దెకిచ్చాడు. అద్దెకు తీసుకున్న వ్యక్తి ఆ ఇంటిని వ్యభిచారం గృహంగా మార్చాడు. 2020 జనవరి 25న పోలీసులు జరిపిన సోదాల్లో ఆ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించారు. ఇంట్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తుండటంతో యజమానిపై పోలీసులు ఇమ్మోరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) యాక్ట్ 1956తోపాటు, ఐపీసీ 370 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, దీనిపై యజమాని కోర్టును ఆశ్రయించాడు. తన ఇంట్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న విషయంపై తనకు ఎలాంటి అవగాహన లేదని, కాబట్టి తనపై పెట్టిన కేసులను కొట్టివేయాలంటూ ప్రభురాజ్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై కోర్టు విచారణ జరిపింది. పోలీసులు కూడా తమ పిటిషన్‌లో యజమానికి ఈ విషయంపై అవగాహన లేదని పేర్కొన్నారు. దీంతో తన ఇంట్లో వ్యభిచార గృహం నిర్వహణ విషయం యజమానికి తెలియదు కాబట్టి, అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని సూచించింది. అతడిపై నమోదైన కేసులు కొట్టివేసింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.