టెండర్‌...వండర్‌

ABN , First Publish Date - 2020-12-02T06:08:47+05:30 IST

న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) నిధులతో చేపట్టనున్న పనులను తమ అనుయాయులకు కట్టబె ట్టేందుకు ప్రభుత్వ పెద్దలు రంగం సిద్ధంచేశారు.

టెండర్‌...వండర్‌

నాడు 2, నేడు 3...

ఎన్‌డీబీ నిధులతో చేపట్టనున్న ఆర్‌అండ్‌బీ పనులకు మళ్లీ టెండరింగ్‌

రూ.140 కోట్ల పనులు దక్కించుకునేందుకు జిల్లాయేతర కాంట్రాక్టర్ల పోటీ

ఒకరి పేరు ముందే ఫైనల్‌ చేసిన ప్రభుత్వ పెద్దలు?

స్థానిక కాంట్రాక్టర్ల అసంతృప్తి


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) నిధులతో చేపట్టనున్న పనులను తమ అనుయాయులకు కట్టబె ట్టేందుకు ప్రభుత్వ పెద్దలు రంగం సిద్ధంచేశారు. రహ దారులు, భవనాల శాఖలో రూ.140 కోట్లతో చేపట్ట నున్న ఈ పనుల కోసం జిల్లాతో సంబంధం లేని ముగ్గురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసినట్టు సమాచారం. గత నెలాఖరులో ఈ ప్రక్రియను అధికా రులు ముగించారు. ముగ్గురిలో ఎవరికి పనులు దక్కా లన్నది ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి ముందుగానే ఫైనల్‌ చేశారని తెలిసింది. 


రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌డీబీ నిధులతో చేపట్టనున్న పనులను తమకు అనుకూలురైన వారికి ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు ముందే నిర్ణయించుకున్నారు.   ఒక్కో జిల్లాలో పనులు ఒక్కొక్కరికి అప్పగించేలా...గతంలో టెండర్లను ఆహ్వానించారు. స్థానిక కాంట్రాక్టర్లు ఎవరూ ఆ టెండర్లలో పాల్గొనకుండా చేశారు. తాము అను కున్న వ్యక్తులు మాత్రమే టెండర్లు వేసేలా నిబంధ నలు రూపొందించారు. అయితే దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించడంతో టెండర్ల ప్రక్రియను రద్దు చేసి...అక్టోబరు నెలలో తాజాగా నోటిఫికేషన్‌ ఇచ్చారు. ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వడంతో జిల్లాల్లో వున్న కాంట్రాక్టర్లు టెండర్లు వేసుకునేందుకు అవకాశముంటుందని భావించారు. అయితే అటువంటి అవకాశమేదీ ఇవ్వలేదు. మొదటిసారి నోటిఫికేషన్‌ ఇచ్చి నప్పుడు జిల్లాలో రెండే టెండర్లు దాఖలు అయ్యేలా ప్రభుత్వ పెద్దలు చక్రం తిప్పితే..ఇప్పుడు వాటికి అద నంగా మరొకటి మాత్రమే వచ్చేలా చేశారు. ముగ్గురిలో ఒకటి మాత్రమే అసలు కాగా..మిగిలిన రెండు కూడా సదరు కంపెనీకి సహాయంగా వేసినవిగా పేర్కొంటు న్నారు. ఈ మాత్రం దానికి ప్రభుత్వం గతంలో నిర్వ హించిన టెండర్ల ప్రక్రియను రద్దు చేయడమెందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.  


కొత్త సంప్రదాయంపై ఆందోళన..  

ఆర్‌అండ్‌బీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ టెండర్ల ప్రక్రియ నిర్వహించడంపై స్థానిక కాంట్రాక్టర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఏదైనా ఒక ప్రాంతంలో రోడ్లు వేయాలంటే..ఆ ప్రాంతానికి మాత్ర మే టెండర్లు పిలిచేవారని, ఇప్పుడు అలా కాకుండా జిల్లాను యూనిట్‌గా చేసి పనులు అప్పగించడం దారు ణమని వాపోతున్నారు. ఆర్‌అండ్‌బీలో తీసుకువచ్చిన ఈ కొత్త సంప్రదాయం వల్ల ఏళ్ల తరబడి కాంట్రాక్టులు చేస్తున్నవారు పనుల్లేక ఆర్థికంగా చితికిపోయే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-12-02T06:08:47+05:30 IST