బైబై.. డాడ్‌

ABN , First Publish Date - 2021-05-09T09:25:17+05:30 IST

ఇన్నాళ్లూ తనకు కోచ్‌గా వ్యవహ రించి, కెరీర్‌ను ఉన్నత స్థాయికి చేర్చిన తండ్రి అలెక్స్‌కు అమెరికా టెన్నిస్‌ స్టార్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చాంపియన్‌ సోఫియా కెనిన్‌ ఉద్వాసన పలికింది.

బైబై.. డాడ్‌

టెన్నిస్‌ స్టార్‌ సోఫియా కెనిన్‌ కఠిన నిర్ణయం

న్యూయార్క్‌: ఇన్నాళ్లూ తనకు కోచ్‌గా వ్యవహ రించి, కెరీర్‌ను ఉన్నత స్థాయికి చేర్చిన తండ్రి అలెక్స్‌కు అమెరికా టెన్నిస్‌ స్టార్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చాంపియన్‌ సోఫియా కెనిన్‌ ఉద్వాసన పలికింది. ఇకనుంచి తండ్రి తన కోచ్‌ కాదని సోషల్‌ మీడియాలో ప్రకటించింది. ఈ సంద ర్భంగా తండ్రి అలెక్స్‌తో కలిసి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచాక తాను దిగిన ఫొటోను షేర్‌ చేసింది. ప్రస్తుతం డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో 4వ స్థానంలో ఉన్న 22 ఏళ్ల కెనిన్‌.. నిరుడు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గడంతో పాటు అదే ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నరప్‌గా నిలిచింది. 


Updated Date - 2021-05-09T09:25:17+05:30 IST