ltrScrptTheme3

ఏజెన్సీలో టెన్షన్‌.. టెన్షన్‌

Oct 26 2021 @ 23:56PM

ఎన్‌కౌంటర్‌కు నిరసనగా నేడు బంద్‌కు మావోయిస్టుల పిలుపు

అప్రమత్తమైన పోలీసులు

వాజేడు, అక్టోబరు 26: ఏజెన్సీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిహద్దు పచ్చని అడవులు నివురుగప్పిన నిప్పులా మారాయి. సోమవారం  జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మృతిచెందడంతో మావోయిస్టులు ప్రతికారేచ్ఛతో రగులుతున్నారని తెలుస్తోంది.  ఎన్‌కౌంటర్‌కు నిరసనగా బుధవారం బంద్‌ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరో వైపు మావోయిస్టులు జగన్‌ పేరిట విడుదలైన లేఖతో టీఆర్‌ఎస్‌ నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. మావోయిస్టులు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడతారోనని గుబులు పుడుతున్నారు. మరో వైపు ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న నక్సల్స్‌ కోసం పోలీసులు వేట కొనసాగిస్తూనే ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో   మన్యంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్‌ సరిహద్దు టేకులగూడెం నుంచి చెరుకూరు జాతీయ రహదారిపై పోలీసులు మంగళవారం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. వంతెనలు, కల్వర్టులను  పేరూరు పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.  పేరూరు ఎస్సై పోగుల శ్రీకాంత్‌ నేతృత్వంలోని సీఆర్పీఎఫ్‌ బలగాలు సోదాలు నిర్వహించాయి. అదే విధంగా వెంకటాపురం(నూగూరు) మండలంలోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన ఎదిర వద్ద సీఐ కాగితోజు శివప్రసాద్‌ వాహనాల తనిఖీ చేపట్టారు. ఏజెన్సీలో హైఅలర్ట్‌ ప్రకటించిన పోలీసులు టార్గెట్‌గా ఉన్న అధికార పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు నోటీసులు జారీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించినట్లు సమాచారం. అధికారిక కార్యాక్రమాలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు సంబంధిచిన భారీ యంత్రాలను సైతం పోలీ్‌సస్టేషన్లకు తరలించినట్టు తెలిసింది. అదే విధంగా వాజేడు, పేరూరు, వెంకటాపురం(నూగూరు) పోలీ్‌సస్టేషన్లకు సైతం భద్రతను పెంచినట్లు సమాచారం. ఏజెన్సీలో జరుగుతున్న పరిణామాలపై జిల్లా పోలీస్‌ యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.