పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-03-10T22:38:31+05:30 IST

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాలలో ఉద్రిక్త పరిస్థితులు

పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత

గుంటూరు: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరులోని విద్యానగర్ లిటిల్ ఫ్లవర్ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ అభ్యర్థి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలోకి వస్తున్న టీడీపీ అభ్యర్థిని పోలీసులు బయటకు నెట్టివేశారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ అభ్యర్థి కొమ్మినేని కోటేశ్వరరావు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా ఎంపీ గల్లా జయదేవ్, పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు శ్రావణ్ ఆందోళన చేశారు. 




కర్నూలు: జిల్లాలోని నంద్యాల 23 వార్డు పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ కార్యకర్తలు దొంగ ఓటు వేయించేందుకు ప్రయత్నించగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.  పోలీసులు రావడంతో గొడవ సర్దుమణిగింది.

Updated Date - 2021-03-10T22:38:31+05:30 IST