గుంటూరు: తెనాలి ప్రభుత్వాస్పత్రి దగ్గర టెన్షన్ మొదలైంది. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్ వచ్చారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. ఓవైపు తిరుపతమ్మ మృతదేహం, మరోవైపు రూప మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ శ్రేణులు అంబులెన్స్‌ను అడ్డుకున్నారు. పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు బలవంతంగా తరలించారు. పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు.