మదనపల్లెలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-01-29T06:37:50+05:30 IST

ఎంపీ కార్యాలయ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు మార్కెట్‌ వద్ద జిల్లా సాధన సమితి అర్ధనగ్న ప్రదర్శన

మదనపల్లెలో ఉద్రిక్తత

 మదనపల్లె, జనవరి 28: మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్‌తో జిల్లా సాధన జేఏసీ చేపట్టిన ఎంపీ మిథున్‌రెడ్డి కార్యాలయ ముట్టడిని పోలీసులు శుక్రవారం అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయాన్ని ఒకరోజు ముందుగానే ఆందోళనకారులు ప్రకటించడంతో పుంగనూరు రోడ్డులోని ఎంపీ కార్యాలయం వద్ద పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నాయకులను పోలీసులు ఉదయం నుంచే పట్టణంలో ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పోలీసుల అంచనాలను తారుమారు చేస్తూ జేఏసీ నాయకులు మరోమార్గం గుండా ఎంపీ కార్యాలయం వద్దకు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ చొచ్చుకొచ్చారు.అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడింది. చివరకు అరెస్టు చేసి వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషనుకు తరలించారు. 30 మంది జేఏసీ నాయకులపై కేసు నమోదు చేసి సొంత పూచీకత్తుపై వదిలేశారు. మాజీ ఎమ్మెల్యేలు షాజహాన్‌బాషా, దొమ్మలపాటి రమేష్‌, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు, జనసేన రాయలసీమ కన్వీనర్‌ గంగారపు రాందాస్‌ చౌదరి, బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్‌, సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు కృష్ణప్ప, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ యమలాసుదర్శనం తదితరులు మాట్లాడుతూ  పోలీసులు ఎన్నికేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. పశ్చిమాన నాలుగు నియోజకవర్గాల నాయకులతో కలసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని  హెచ్చరించారు.పాల్గొన్నారు. మదనపల్లె టమోటా మార్కెట్‌ ముందు జిల్లాసాధన సమితి కన్వీనర్‌ పీటీఎం శివప్రసాద్‌ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శనతో రాస్తారోకో చేశారు.దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.మరోవైపు మదనపల్లె జిల్లాకోసం చేపట్టిన ఆందోళన  శుక్రవారానికి 599వ రోజుకు చేరుకుంది.ఈ సందర్భంగా పీటీఎం శివప్రసాద్‌ మాట్లాడుతూ మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకూ వివిధ రూపాల్లో పోరాడుతామన్నారు.ప్రధాన రాజకీయ పార్టీలు జిల్లా సాధన విషయంలో  ప్రాంతాలను బట్టి మాట్లాడకూడదని విజ్ఞప్తి చేశారు.రాజంపేట,మదనపల్లె నాయకులు వారివారి ప్రాంతాలనే జిల్లా కేంద్రంగా చేయాలని కోరడం కాకుండా పార్టీ తరపున ఒకే స్వరం విన్పించాలని,జిల్లా సాధన కోసం సీఎం జగన్‌కు లేఖరాయాలని సూచించారు.  ములకలచెరువులోనూ టీడీపీ, జనసేన, సీపీఐ, బాస్‌, ఎమ్మార్పీఎస్‌ ఏఐటీయూసీ నాయకులు మానవహారంగా నిలబడి ధర్నా చేపట్టారు.టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పర్వీన్‌తాజ్‌, మాజీ జడ్పీటీసీ సభ్యుడు కువైట్‌ శంకర్‌ తదితరులు మాట్లాడుతూ ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా జిల్లాలను ప్రకటించిన జగన్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు.

Updated Date - 2022-01-29T06:37:50+05:30 IST