AP News: ప.గో.జిల్లా, పాలకొల్లులో స్వల్ప ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-08-08T16:57:54+05:30 IST

పాలకొల్లులో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. టిడ్కో ఇళ్లను అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ...

AP News: ప.గో.జిల్లా, పాలకొల్లులో స్వల్ప ఉద్రిక్తత

ప.గో. జిల్లా (West Godavari): పాలకొల్లులో స్వల్ప ఉద్రిక్తత (Tension) చోటు చేసుకుంది. టిడ్కో (Tidco) ఇళ్లను అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల (Nimmala Ramanaidu) రామానాయుడు చేస్తున్న పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజల వద్దకు వెళ్లడం ప్రజా ప్రతినిధిగా తన హక్కని రామానాయుడు వాదించారు. పోలీసులు కావాలనే ఎమ్మెల్యే పాదయాత్రను అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు (TDP Leaders)  ఆరోపించారు.

Updated Date - 2022-08-08T16:57:54+05:30 IST